ETV Bharat / crime

డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా.. తల్లీకుమారుడు మృతి - Road accident in Nalgonda district

Nalgonda Car Accident Today : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ కారు అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తల్లీకుమారుడు మరణించగా.. తీవ్ర గాయాలైన మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు.

Road accident
Road accident
author img

By

Published : Dec 16, 2022, 8:45 AM IST

Updated : Dec 16, 2022, 8:57 AM IST

Nalgonda Car Accident Today : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కేతేపల్లి మండలం ఇనుపాముల 65వ నెంబర్ జాతీయ రహదారిపై అదుపుతప్పి ఓ కారు డివైడర్​ను ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారులో మంటలు చెలరేగి.. చూస్తుండగానే పెద్దఎత్తున వ్యాపించాయి. గమనించిన వాహనదారులు వెంటనే స్పందించి కారులో ఉన్న ఐదుగురిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫణి కుమార్​, అతని తల్లి కరుణ మరణించగా.. ఫణి కుమార్​ భార్య కృష్ణ వేణి, పాప, మరొకరు చికిత్స పొందుతున్నారు. బాధితులంతా సూర్యాపేట జిల్లా కేంద్రం విద్యానగర్​ కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారిగా సమాచారం.

ఇవీ చదవండి: చిట్టీల పేరుతో భారీ మోసం.. నిందితురాలికి 14 రోజులు రిమాండ్​

హాస్టల్​కు వచ్చి HM లైంగిక వేధింపులు.. కర్రలు, చీపుర్లతో చితకబాదిన అమ్మాయిలు

Last Updated : Dec 16, 2022, 8:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.