భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సమితిసింగారం గ్రామానికి చెందిన పి. నర్సింహారావు సిమెంట్ వస్తువులు తయారీ పనులు నిర్వహిస్తుంటాడు. తన వద్ద పనిచేసే నాగరాజుతో కలిసి నర్సింహారావు ట్రాలీ ఆటోలో ఏడూళ్ల బయ్యారం వెళ్తుండగా వీరి వాహనం ముందువెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.
అదుపు తప్పిన వీరి వాహనం ఎదురుగా వస్తోన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సింహారావు అక్కడికక్కడే మృతి చెందాడు. అదే మార్గంలో వెళ్తున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఘటనా స్థలి వద్ద ఆగి అంబులెన్స్‌ను పిలిపించి తీవ్ర గాయాలపాలైన నాగరాజును ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై రాళ్ల దాడి