తాగి వాహనం నడపడమే కాదు....రోడ్డుపై నడవడమూ ప్రమాదమే. హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం. మద్యం సేవించిన ఓ వ్యక్తి నిజాంపేట్ కూడలిలో రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. వాహనాలకు గ్రీన్ సిగ్నల్ పడినా గమనించక...అలాగే ముందుకు కదలడంతో బస్సు ఢీకొట్టింది.
పక్కనే డివైడర్‌పై పడిన వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మద్యం సేవించిన ఎలాంటి పరిస్థితుల్లోనూ రోడ్లపైకి రావొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: అకాల వర్షం... కొట్టుకు పోయిన ధాన్యం