Road Accident in Srikakulam District: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఉపాధి హామీ కూలీలపైకి ఓ లారీ అదుపుతప్పి వేగంగా దూసుకెళ్లింది. ఆమదాలవలస-పాలకొండ రోడ్డుపై మందాడ గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతి చెందినవారు మందాడ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: కరీంనగర్లో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కేసు సుఖాంతం
'ముంబయిలో ఉగ్రదాడులు చేస్తాం'.. ట్విట్టర్ వేదికగా మరోసారి వార్నింగ్.. భయపడొద్దన్న పోలీసులు