కరీంనగర్లో గుర్తు తెలియని మహిళ హత్యకు సంబంధించి ఎలాంటి సమాచారం లభించలేదు. ఆ ప్రాంతం పరిధిలోని వివిధ ప్రాంతాల్లోని సీసీ పుటేజీని పోలీసులు విడుదల చేశారు. అందులో గులాబీ రంగు చొక్కా వేసుకున్న వ్యక్తి హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కోర్టు బస్ స్టాప్ సమీపంలోని మురికి కాలువలో మంగళవారం ఉదయం మృతదేహం లభించింది. స్థానికుల సమాచారంతో కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి, అడిషనల్ సీపీ చంద్రమోహన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మహిళ మెడకు చున్నీ బిగించి హతమార్చి డ్రైనేజీలో మృతదేహాన్ని పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మృతురాలిని గుర్తించిన వారికి తగిన పారితోషికం ఇస్తామని పోలీసులు ప్రకటించారు. మహిళ వయస్సు 35-40 ఏళ్లు, చామనఛాయ రంగు, ఎత్తు-5 ఫీట్లు, దుస్తులు: ముదురు పింక్ కలర్ కుర్తా పైజామా, మెడలోని పసుపు తాడులో ఎరుపు, నలుపు పూసలు, ఒక పుస్తెలో ఏసుక్రీస్తు సిలువ, కాళ్లకు పట్టీలు, ఎడమ చేతిపై మ్యూజిక్ సింబల్ టాటూ(పచ్చబొట్టు) గుర్తులు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఆమె వివరాలు తెలిపిన వారి సమాచారం గోప్యంగా ఉంచి.. వారికి తగిన పారితోషికం ఇస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి : ఫుడ్ పాయిజన్, 32 మందికి అస్వస్థత