హైదరాబాద్‌లో స్థిరాస్థి వ్యాపారి కిడ్నాప్, హత్య ఘటన మరవకముందే.. నిర్మల్‌లో మరో స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్ కలకలం సృష్టంచింది. వ్యాపారి విజయ్‌చందర్ దేశ్‌పాండేను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. తన్వి అపార్ట్‌మెంట్‌లోని ఇంట్లో ఉన్న విజయ్‌చందర్ కిడ్నాప్ చేశారని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు దుండగులు విజయ్‌చందర్‌ను కారులో తీసుకెళ్లినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విజయ్‌చందర్ ఫోన్, స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద విజయ్‌చందర్ ఆచూకీ కనుగొన్నారు. తూప్రాన్ వద్ద ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
గత నెల 20న హైదరాబాద్ కేపీహెచ్‌బీ ఠాణా వెనక వైపు అడ్డగుట్టలోని ఓ వసతి గృహంలో ఉంటున్న ఏపీలోని నెల్లూరుకు చెందిన గడ్డం విజయ్‌భాస్కర్‌రెడ్డిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవిలే హత్యకు కారణంగా తేల్చారు.
ఇదీ చదవండి: Honey Trap: మసాజ్ పేరుతో వలపు వల.. ఆ తర్వాత వీడియోలతో బెదిరిస్తూ...
తాడేపల్లి అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు కృష్ణ కిశోర్ అరెస్ట్
స్థిరాస్తి వ్యాపారి హత్య కేసు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు