ETV Bharat / crime

ఎస్పీ పేరు చెప్పి సీఐ చేతివాటం.. ఏం జరిగిదంటే - kurnool taluka ci

CI Corruption:ఏపీ కర్నూలు జిల్లాలో ఓ సీఐ చేతివాటం బయటపడింది. ఓ ప్రయాణికుడి నుంచి 15 లక్షల రూపాయలు బలవంతంగా తీసుకున్నాడు. ఈ విషయమై బాధితుడు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తీగ లాగితే.. డొంక మొత్తం కదిలింది.

CI Kambagiri Ramudu
సీఐ కంబగిరి రాముడు
author img

By

Published : Mar 25, 2022, 12:34 PM IST

CI Corruption:ఏపీ కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ కంబగిరి రాముడుపై.. అదే స్టేషన్‌లో కేసు నమోదుచేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 19న పంచలింగాల చెక్ పోస్టు వద్ద సెబ్ అధికారులు హైదరాబాద్ నుంచి తమిళనాడు వెళ్తున్న బస్సును ఆపి తనిఖీ చేశారు. తమిళనాడుకు చెందిన సతీశ్ బాలకృష్ణన్ అనే ప్రయాణికుడి వద్ద 75 లక్షల రూపాయలు దొరికాయి. సెబ్ అధికారులు డబ్బుతో పాటు అతన్ని కర్నూలు తాలూకా అర్బన్ పోలీసు స్టేషన్ కు అప్పగించారు. డబ్బుకు సంబంధించిన పత్రాలన్నీ పోలీసులకు చూపించారు.

అయితే.. సీఐ కంబగిరి రాముడు మొత్తం సొమ్ము తిరిగి ఇవ్వకుండా.. జిల్లా ఎస్పీకి ఇవ్వాలంటూ 15 లక్షల రూపాయలు బలవంతంగా తీసుకున్నారని బాధితుడు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. ఈ డబ్బులో 5 లక్షలు ముగ్గురు మధ్యవర్తులకు ఇచ్చి, మిగిలిన 10 లక్షలను సీఐ కంబగిరి రాముడు తనవద్దే ఉంచుకున్నారని సమాచారం. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి.. అదే పోలీస్ స్టేషన్లో సీఐపై కేసు నమోదు చేసి.. కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు.

బాధితుడు సతీశ్ బాలకృష్ణన్ ఫిర్యాదు మేరకు సీఐతో పాటు ముగ్గురు మధ్యవర్తులపైనా కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇదీ చదవండి: Fake Certificates: ఫేక్ సర్టిఫికెట్లతో 30 ఏళ్లపాటు ఉద్యోగం.. చివరకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.