ETV Bharat / crime

బ్యూటీపార్లర్ పెట్టిస్తానని ఆశ చూపి‌.. బర్త్​డే రోజే అత్యాచారం.. - బ్యూటీపార్లర్ పెట్టిస్తానని ఆశ చూపి‌ బర్త్​డే రోజే అత్యాచారం

Rape on Beautician: బర్త్​డే వేడుకల సాకుతో వచ్చి బ్యూటీషియన్​పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన.. మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల పరిధిలో జరిగింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించాగా.. విషయం వెలుగుచూసింది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

Rape on Beautician on her birthday at jeedimetla

author img

By

Published : Aug 11, 2022, 3:19 PM IST

Rape on Beautician: బ్యూటీపార్లర్ పెట్టిస్తానని ఆశ చూపి‌.. బర్త్​డే రోజే అత్యాచారం చేసిన ఘటన మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ ప్రాంతానికి చెందిన మహిళ.. ఆరు నెలల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చింది. గాజులరామారాంలోని ప్రిస్టన్​ప్లేస్ అపార్ట్‌మెంట్​లో నివాసముంటోంది. బ్యుటీషియన్ కోర్స్​ నేర్చుకొని బ్యూటీషియన్​గా పని చేస్తూ.. జీవనం సాగిస్తోంది.

ఈ క్రమంలోనే ఆ మహిళకు సంజీవరెడ్డి(57)తో పరిచయం ఏర్పడింది. మహిళ అవసరాన్ని తెలుసుకున్న సంజీవరెడ్డి.. బ్యుటీపార్లర్ స్టుడియో పెట్టిస్తానని ఆశచూపాడు. తనకు సాయం చేస్తాననటంతో.. సంజీవరెడ్డిని మహిళ నమ్మింది. ఇదే అదునుగా తీసుకున్న సంజీవరెడ్డి.. నిన్న రాత్రి ఆమె బర్త్​డే సందర్భంగా మహిళ నివాసానికి వెళ్లాడు. పుట్టినరోజు సాకుతో ఇంటికి వచ్చిన సంజీవరెడ్డి.. తనపై అత్యాచారం చేశాడని బాధిత మహిళ.. జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంజీవరెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.