ETV Bharat / crime

వివాహేతర సంబంధం అడ్డుపెట్టుకుని వివాహితపై అత్యాచారం - hyderabad rape case

వివాహేతర సంబంధం అడ్డుపెట్టుకుని వివాహితపై అత్యాచారం

author img

By

Published : Dec 17, 2021, 6:54 PM IST

Updated : Dec 17, 2021, 7:54 PM IST

18:49 December 17

వివాహేతర సంబంధం అడ్డుపెట్టుకుని వివాహితపై అత్యాచారం

వివాహేతర సంబంధం అడ్డుపెట్టుకుని వివాహితపై ఇద్దరు అత్యాచారం చేసిన ఘటన హైదరాబాద్​లోని బోరబండలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇస్మాయిల్​ అనే వ్యక్తితో పాటు మరో బాలుడు అత్యాచారం చేసినట్లు బాధిత మహిళ వెల్లడించింది.

ఎలా వెలుగులోకి వచ్చిందంటే..

ఈ నెల 15న వికారాబాద్​ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి అటవీ ప్రాంతంలో సదరు మహిళ మరో యువకుడితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు గమనించి వికారాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లగా... వైద్యులు చికిత్స అందించి వారి ప్రాణాలను రక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. వీరు ఇరువురు హైదరాబాద్​లో ఒకే సంస్థలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. చికిత్స తర్వాత బాధిత మహిళ, యువకుడు కోలుకోగా పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ఈ విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మహిళపై ఇద్దరు అత్యాచారం

బాధిత మహిళకు బోరబండకు చెందిన యువకుడితో గత కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న ఇస్మాయిల్​తో పాటు మరో బాలుడు సదరు మహిళను బ్లాక్​మెయిల్​ చేశారు. వీడియోలు బయటపెడతామని బెదిరించి వివాహితపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. పదేపదే బెదిరిస్తుండడంతో వివాహిత విసిగిపోయింది. వీడియోలు ఉన్నాయని భయపెట్టడంతో వికారాబాద్​ జిల్లా కండ్లపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లి వివాహితతో పాటు యువకుడు పురుగుల మందు తాగారు.

ఈ ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. వివాహిత ఫిర్యాదు మేరకు బోరబండకు చెందిన ఇస్మాయిల్​తో పాటు బాలుడిపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

Suicide Attempt: ప్రియుడితో కలిసి విషం తాగిన వివాహిత.. పరిస్థితి విషమం

Last Updated : Dec 17, 2021, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.