ETV Bharat / crime

గుర్తు తెలియని మహిళపై దుండగుల హత్యాచారం - దారుణ హత్య

అత్యంత రద్దీగా ఉండే వరంగల్-హైదరాబాద్‌ జాతీయ రహదారి పక్కనే గుర్తు తెలియని మహిళపై అతి కిరాతకంగా హత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పీఎస్ పరిధిలోని అన్నోజిగూడలో జరిగింది.

rape cum murder on  of an unidentified woman
మేడ్చల్ జిల్లాలో దారుణం
author img

By

Published : May 9, 2021, 7:58 PM IST

నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే వరంగల్-హైదరాబాద్‌ జాతీయ రహదారిలో దారుణం జరిగింది. గుర్తు తెలియని మహిళను అత్యంత దారుణంగా హత్యాచారం చేశారు కిరాతకులు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పీఎస్‌ పరిధిలోని అన్నోజిగూడలో చోటు చేసుకుంది.

పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలోని దుకాణాల సముదాయంపై నుంచి భరించలేని వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దుకాణం మిద్దెపై గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆమె పక్కనే మందు, నీటి సీసాలు పడి ఉండగా.. వేలిముద్రల నిపుణులను రప్పించి పోలీసులు ఆధారాలు సేకరించారు.

రెండు రోజుల క్రితమే.!

మృతి చెందిన మహిళ కూలీ అయి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. రెండు రోజుల క్రితమే హత్యాచారం చేసి ఉంటారని సీఐ ఎన్‌.చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. సమీపంలోని మద్యం దుకాణం, రహదారులపై ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. కేసు నమోదు చేసుకుని హత్యకు గల కారణాలపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. మహిళ వివరాలు తెలిస్తే కేసు మిస్టరీ వీడుతుందన్నారు.

ఇదీ చూడండి: కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.