హైదరాబాద్‌లో భారీగా నకిలీ విత్తనాల గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. వనస్థలిపురం, హయత్‌నగర్‌లోని మూడు ప్రాంతాల్లోని గోడౌన్లలో నకిలీ విత్తనాలను గుర్తించారు. నకిలీ విత్తనాల అక్రమ నిల్వ, గడువు ముగిసిన విత్తనాలను తిరిగి కొత్తగా ప్యాక్ చేయడం, నిషేధిత విత్తనాలను విక్రయిస్తున్న ముగ్గురు వ్యాపారులను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు.
కోటి రూపాయలకు పైగా విలువ చేసే నకిలీ విత్తనాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ తెలిపారు. హయత్‌నగర్‌లోని శాంతినగర్‌లో జరిపిన దాడుల్లో రూ. 50 లక్షల విలువైన విత్తనాలు, సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మరో చోట రూ. 60లక్షల విలువైన విత్తనాలతో పాటు ప్యాకింగ్ యంత్రాలను సీజ్ చేసినట్లు సీపీ చెప్పారు. గత నాలుగేళ్లలో రాచకొండ పరిధిలో 10 కేసులు నమోదు చేసినట్లు మహేశ్ భగవత్ వెల్లడించారు. నకిలీ విత్తనాల విక్రయం చేపట్టిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు.
ఇదీ చదవండి: etala resign: ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా