పెళ్లి కోసం అప్పు తెచ్చుకున్న బంగారం, నగదు విద్యుదాఘాతంతో కాలిపోయిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంటలో చోటుచేసుకుంది. భాషమోని బిచ్చయ్య బాలింగమ్మ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఉదయం వారు కూలి పనులకు వెళ్లగా ఇంట్లోని పిల్లలు టీవీ చూస్తున్నారు. విద్యుదాఘాతంతో ఒక్కసారిగా గుడిసెకు మంటలు అంటుకున్నాయి. ఇది గమనించిన ఇరుగు పొరుగు గుడిసెలో ఉన్న పిల్లలను కాపాడారు.
విషయం తెలుసుకున్న బిచ్చయ్య దంపతులు ఇంటికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. కూతురు పెళ్లి కోసం అప్పు తెచ్చుకున్న రూ. 2.7 లక్షల నగదు, 3తులాల బంగారం, 50 తులాల వెండి అగ్నికి ఆహుతయ్యాయని వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. బిచ్చయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
ఇదీ చదవండి: తపోవన్ సొరంగం వద్ద సహాయక చర్యలకు ఆటంకం