ETV Bharat / crime

పెన్షన్ సొమ్ములో దొంగ నోట్ల ఘటన.. మార్చింది ఎవరో తెలుసా! - నర్సాయపాలెం దొంగ నోట్ల ఘటన తాజా సమాచారం

Fake Notes Incident Update : ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పింఛన్ల సొమ్ములో దొంగనోట్ల ఘటనలో వాలంటీరే నిందితుడని తేలింది. నిన్న ప్రకాశం జిల్లాలో వాలంటీర్లు పంపిణీ చేసిన పింఛన్ల డబ్బులో దొంగ నోట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఎంపీడీవో సుబ్బారాయుడు కీలక సమాచారాన్ని బయటపెట్టాడు. పింఛన్ల సొమ్ములో దొంగ నోట్లను మార్చిన వ్యక్తి వాలంటీరేనని వెల్లడించారు.

Narsayapalem fake notes Incident
పెన్షన్ సొమ్ములో దొంగ నోట్లు
author img

By

Published : Jan 2, 2023, 2:22 PM IST

Fake Notes Incident Update : ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నర్సాయపాలెంలో ఆదివారం వాలంటీర్లు పంపిణీ చేసిన పింఛన్ల సొమ్ములో దొంగ నోట్లు వచ్చిన విషయం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పింఛన్ల సొమ్ములో దొంగ నోట్లు రావడంపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పింఛన్​ డబ్బులను పంపిణీ చేసిన వాలంటీర్ ఆమోస్‌ను ప్రశ్నంచగా.. అతడు బుకాయించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. వాలంటీర్ ఆమోస్‌ను గట్టిగా అడగ్గా అసలు విషయం బయటపడింది.

తానే ఆ దొంగ నోట్లను మార్చినట్లు ఒప్పుకున్నాడని ఎంపీడీవో సుబ్బారాయుడు తెలిపారు. అతడిని విధుల నుంచి తొలిగించి, పోలీసులకు అప్పజెప్పామన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వాలంటీర్ ఆమోస్‌కి దొంగ నోట్లు ఎలా వచ్చాయి? ఎక్కడ నుంచి వచ్చాయి? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే..: యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం రోజు వాలంటీర్ ఆమోస్‌ ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ఓ లబ్ధిదారుడు పింఛను నగదుతో ఓ దుకాణానికి వెళ్లగా.. అందులో నకిలీ నోట్లు గుర్తించారు. ఈ విషయాన్ని వాలంటీరు దృష్టికి తీసుకెళ్లగా. పంపిణీ సొమ్ములో మరిన్ని నకిలీ నోట్లు కనిపించాయి. దీంతో గ్రామంలో రూ.19వేల విలువైన రూ.500 నకిలీ నోట్లను లబ్ధిదారుల నుంచి వాలంటీరు తీసుకొని అధికారులకు అప్పగించారు.

"నేను తెల్లవారే సరికి పింఛన్లు ఇచ్చేశాను. తెల్లవారిన తరువాత ఇవి దొంగనోట్లు అని పింఛను తీసుకున్నవారు చెప్పారు. నేను వాటిని పరిశీలించి, అధికారులకు సమాచారం ఇచ్చాను. వాళ్లు వచ్చి వాటిని తీసుకువెళ్లారు"- వాలంటీర్ ఆమోస్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.