Police vehicle accident: హైదరాబాద్ పాతబస్తీ కాలపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తాడ్బన్ ప్రాంతంలో పోలీస్ వాహనం బీభత్సం సృష్టించింది. పోలీస్ శాఖకు చెందిన టాటాసుమో వాహనం తాడ్బన్ ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో.. నలుగురు పాదచారులకు గాయాలయ్యారు.
క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పాదచారులకు స్వల్ప గాయాలయ్యాయని కాలపత్తర్ సీఐ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
ఇదీ చూడండి: