ETV Bharat / crime

Hyderabad Pub Case: 'కాల్‌ డేటాపై ఫోకస్.. మొదటి రోజు విచారణ పూర్తి'

Hyderabad Pub Case: ఫుడింగ్ అండ్‌ మింక్‌ పబ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు ప్రధాన నిందితులు అనిల్‌, అభిషేక్‌లను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఏసీపీ స్థాయి అధికారి సమక్షంలో విచారించారు.

Hyderabad Pub Case: పుడింగ్ పబ్ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

author img

By

Published : Apr 14, 2022, 3:19 PM IST

Updated : Apr 14, 2022, 7:15 PM IST

Hyderabad Pub Case: బంజారాహిల్స్ పరిధిలోని పుడింగ్ అండ్‌ మింక్‌ పబ్‌లో డ్రగ్స్ లభ్యమైన కేసులో నిందితులు అభిషేక్, అనిల్‌ మొదటి రోజు కస్టడీ విచారణ ముగిసింది. చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న అనిల్, అభిషేక్​లను పోలీసులు కస్టడీలోకి తీసుకొని ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. నాలుగు రోజుల కస్టడీలో ఠాణాకు తీసుకువచ్చి విచారించారు. ఏసీపీ స్థాయి అధికారి సమక్షంలో కస్టడీ విచారణ కొనసాగతోంది. వారిద్దరి కాల్ డేటాపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు... సుమారు 4 గంటల పాటు ఇద్దరినీ విడివిడిగా విచారించారు. పబ్‌కు హజరైన కష్టమర్ల వివరాలపై అభిషేక్‌ను ప్రశ్నించారు.

వారం ముందుగానే డ్రగ్స్: మరోవైపు పబ్ భాగస్వాములు, అగ్రిమెంట్లపై కూడా అభిషేక్‌ను ప్రశ్నించారు. పార్టీకి వారం కంటే ముందుగా డ్రగ్స్ పబ్‌కు వచ్చినట్లు పోలీసులు వద్ద ఉన్న ఆధారాలు వారి ముందు ఉంచి ప్రశ్నలు సంధించారు. అభిషేక్‌కు తెలిసే ఈ డ్రగ్స్ దందా సాగినట్లు అనుమానిస్తున్న పోలీసులు... గోవా, బెంగళూరులో ఉన్న డ్రగ్ పెడ్లర్లతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. ఈ కేసులో అనిల్, అభిషేక్‌లు ఇచ్చే వివారాలతో మరి కొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. కస్టడీ విచారణ ముగిసే వరకూ బంజారాహిల్స్ ఠాణాలోనే నిందితులను ఉంచనున్నారు. విచారణ జరుగుతున్న సమయంలో అభిషేక్ భార్య లాయర్‌తో ఠాణాకు వచ్చారు.

ఈనెల 3న దాడులు: ఈనెల 3 తెల్లవారుజామున పబ్​పై దాడి చేసిన పోలీసులు 148 మందిని అదుపులోకి తీసుకొని సొంత పూచీకత్తుపై పంపించారు. పబ్‌లో 4.6 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కొకైన్ ఎవరెవరికి సరఫరా చేయడానికి తీసుకొచ్చారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పుడింగ్ పబ్ కేసులో నెల రోజుల వ్యవధిలోనే మూడు పార్టీలు జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మూడు పార్టీల్లోనూ తరచూ పబ్​కు వచ్చే వ్యక్తులే పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ పార్టీల్లోనూ కొకైన్ సరఫరా జరిగిండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పబ్​పై దాడి జరిగిన రోజు మూడు నాలుగు గంటల వ్యవధిలో అభిషేక్ - అనిల్ మధ్య 15సార్లు ఫోన్ సంభాషణలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇన్నిసార్లు ఇద్దరూ కలిసి ఏం మాట్లాడారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Apr 14, 2022, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.