ETV Bharat / crime

బాలుడి కిడ్నాప్​ కథ సుఖాంతం.. పోలీసుల అదుపులో ఇద్దరు మహిళలు - police solved a women kidnapped child case and save the boy safely

Child Kidnap Case: బట్టలిస్తామని నమ్మించి భిక్షాటన చేస్తున్న మహిళ నుంచి బాలుడిని మరో ఇద్దరు మహిళలు ఎత్తుకెళ్లిన కేసును నిజామాబాద్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. బాలుడిని సురక్షితంగా తల్లి వద్దకు చేర్చారు. కిడ్నాప్​ చేసిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

child kidnap in nizamabad
నిజామాబాద్​లో బాలుడి కిడ్నాప్​
author img

By

Published : May 8, 2022, 2:27 PM IST

Child Kidnap Case: నిజామాబాద్ నగరంలో ఈ నెల 6(శుక్రవారం)న జరిగిన 6 నెలల పసికందు కిడ్నాప్ ఉదంతాన్ని నిజామాబాద్​ నాలుగో టౌన్ పోలీసులు ఛేదించారు. బాలుడిని అపహరించిన ఇద్దరు మహిళల నుంచి చిన్నారిని సురక్షితంగా తల్లి వద్దకు చేర్చారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా పసికందును అపహరించిన ఇద్దరు మహిళలూ.. భిక్షాటన చేస్తూ జీవనం సాగించడం గమనార్హం. కేసు వివరాలను నిజామాబాద్​ ఏసీపీ వెంకటేశ్వరరావు వెల్లడించారు.

నగరంలో భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్న మహిళ ఈ నెల 6న ఉదయం ఆర్యనగర్​లోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద తన బిడ్డను ఎత్తుకొని.. భిక్షాటన చేస్తూ ఉంది. ఆ సమయంలో ఆమె వద్దకు వచ్చిన ఇద్దరు మహిళలు.. ఆమెను మచ్చిక చేసుకున్నారు. తన వద్ద ఉన్న పాత బట్టలు ఇచ్చారు. కాసేపు పసికందును ఎత్తుకుంటానని చెప్పిన మహిళ.. బాబును చేతుల్లోకి తీసుకుని బాధితురాలితో పాటు ముందుకు నడిచింది. కాసేపటికి మరికొన్ని దుస్తులు తీసుకువస్తానని నమ్మించి.. ఆ ఇద్దరూ బాలుడిని తీసుకొని వెళ్లిపోయారు. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో.. ఆందోళన చెందిన ఆ తల్లి స్థానిక పోలీస్​స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ఆర్యనగర్​లో వారిని గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన మహిళలు.. బాబును తమ వద్ద ఉన్న బ్యాగులోకి తోశారు. అనుమానం వచ్చిన పోలీసులు.. బ్యాగును తనిఖీ చేశారు. అందులో పసికందును గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ బిడ్డను విలేకరుల సమక్షంలో క్షేమంగా తల్లికి అప్పగించారు. చిన్నారి ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నట్లు ఏసీపీ వెంకటేశ్వర రావు తెలిపారు. అపహరించిన ఇద్దరు మహిళల జీవనోపాధి కూడా భిక్షాటనే అని తెలిపారు.

ఇవీ చదవండి: బట్టలిస్తామని చెప్పి పిల్లాన్ని ఎత్తుకెళ్లిన మహిళలు.. వీడియో వైరల్​..!

'లిక్కర్​ కిక్ ఇవ్వట్లే.. కల్తీ చేస్తున్నారు!'.. హోంమంత్రికి మందుబాబు ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.