ETV Bharat / crime

ప్రేమ.. పెళ్లి.. హత్య.. ఏ క్రైమ్​ లవ్​స్టోరీ - ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

Wife killed by Husband: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కొన్నాళ్లపాటు సంసారం హాయిగానే సాగింది. ఆ తర్వాత భర్త చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి. ఎలాగైనా భార్యను అడ్డు తొలగించాలనుకున్నాడు. అందుకోసం ఓ పథకం వేశాడు. తాను చదువుకుంటున్న రోజుల్లో సందర్శించిన ప్రాంతానికి తీసుకెళ్లి హతమార్చాడు. కొన్ని రోజుల తర్వాత స్థానికులు గుర్తించి... పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది.

ప్రేమ పెళ్లిలో విషాదం
ప్రేమ పెళ్లిలో విషాదం
author img

By

Published : Sep 19, 2022, 10:14 PM IST

ప్రేమ పెళ్లిలో విషాదం.. చెడువ్యసనాలకు బానిసై ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

POLICE SOLVED THE MURDER CASE : ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో కైలాసకోన ప్రాంతంలో గత నెల ఒకటో తారీఖున అనుమానాస్పద స్థితిలో మరణించిన ఓ మహిళ కేసును నారాయణపురం పోలీసులు చేధించారు. భర్తే మహిళను హత్య చేసి అక్కడ వదిలేసి వెళ్లినట్లు విచారణలో తెలిసినట్లు వెల్లడించారు.

డీఎస్పీ విశ్వనాథ్ కథనం ప్రకారం.. "తమిళనాడులోని చైన్నై రెడ్​ హిల్స్​కు చెందిన మదన్​ అనే వ్యక్తి ఆరు నెలల క్రితం తమిళసెల్వి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే చెడు వ్యసనాలకు బానిసైన మదన్.. అతని భార్యతో ప్రతి రోజు గొడవ పెట్టుకునేవాడు. గొడవలతో విసుగు చెందిన మదన్​.. ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. అందుకోసం అతను చదువుకునే రోజుల్లో సందర్శించిన జిల్లాలోని కైలసకోన ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అనుకున్నదే తడవుగా జూన్​ 26న భార్యకి మాయమాటలు చెప్పి.. జలపాతం వద్దకు తీసుకొచ్చాడు. అనంతరం అతని వద్ద ఉన్న కత్తితో పొడిచి హత్య చేసి అక్కడ చెట్ల పొదల్లో పడేసి పారిపోయాడు" అని తెలిపారు.

అడవుల్లో మృతదేహాన్ని స్థానికులు, దేవాలయ అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారమివ్వడంతో ఈ మర్డర్​ వెలుగు చూసింది. ఈ కేసును త్వరితిగతిన దర్యాప్తు చేసి ముద్దాయిని అరెస్ట్ చేసిన శ్రీకాళహస్తి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, అందుకు సహకరించిన నారాయణవనం సర్కిల్ సీఐ సురేష్​కుమార్, ఎస్సై పరమేష్ నాయక్​తో పాటు సిబ్బందిని తిరుపతి ఎస్పీ అభినందించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.