Shilpa Chowdary Cheating Case: పెట్టుబడుల ముసుగులో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాచౌదరికి ఉప్పర్‌పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆమె బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. అనంతరం శిల్పాచౌదరిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. తొలుత ఆమెకు గోల్కొండ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. హెల్త్ చెకప్ అనంతరం ఆమెను... ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. కాగా తనపై వచ్చిన ఆరోపణలన్నీ ఫేక్ అని ఆమె అనడం గమనార్హం.
బ్యాంకు లాకర్‌ను తనిఖీ
శిల్పా చౌదరి పోలీస్ కస్టడీ ఇటీవలె ముగిసింది. మూడు రోజుల కస్టడీ అనంతరం... మళ్లీ ఒక రోజు కస్టడీలోకి తీసుకున్నారు. అందులోభాగంగా పోలీసులు ఆమె బ్యాంకు లాకర్‌ను తనిఖీ చేశారు. కోకాపేట్‌లోని యాక్సిస్ బ్యాంకులో ఉన్న శిల్పా చౌదరి ఖాతాను బ్యాంకు అధికారుల సమక్షంలో పోలీసులు తనిఖీ చేశారు. లాకర్లో ఏమీ లభించకపోవడంతో తిరిగి నార్సింగి ఎస్ఓటీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇతరుల నుంచి కోట్ల రూపాయలు తీసుకున్న శిల్పా వాటిని ఎక్కడికి మళ్లించిందనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
శిల్ప వివరాలు సేకరించిన పోలీసులు
Shilpa bank accounts: శిల్ప బ్యాంకు ఖాతాలో పెద్దగా నగదు లేకపోవడంతో… లాకర్లపై పోలీసులు దృష్టి పెట్టారు. వాటిల్లోనూ ఏమీ లభించలేదని పోలీసులు తెలిపారు. నార్సింగి పీఎస్‌లో ఆమెపై 3కేసులు నమోదు చేశారు. రూ. 7కోట్లు తీసుకొని మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దాదాపు 30 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ డబ్బంతా ఎక్కడికి మళ్లించిందనే వివరాలను సేకరిస్తున్నారు.
పక్కా ప్రణాళిక ప్రకారమేనా?
shilpa frauds: శిల్ప పక్కా ప్రణాళిక ప్రకారం మోసం చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ మోసం గురించి బయటపడినా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకూడదనే ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో పోలీసులు శిల్పతో పాటు.... ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో ఇద్దరూ కలిసి ఎక్కువగా ఎవరితో మాట్లాడారు... వాళ్లకు వీళ్లకు సంబంధం అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. శిల్పా చౌదరితో వ్యాపార సంబంధాలు నెరిపిన వాళ్ల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.