ETV Bharat / crime

Ganja Smuggling: రూ. 1.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత - ఖమ్మం వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సాగు, అక్రమ రవాణా వ్యాపారం హద్దూ అదుపూ లేకుండా సాగుతోంది. గంజాయి ముఠాలు విచ్చలవిడిగా తమ దందాను కొనసాగిస్తున్నాయి. పోలీసులు కూడా తమదైన శైలిలో తనిఖీలు చేస్తూ... గంజాయిని పట్టుకుంటున్నారు. దీనిలో భాగంగా ఖమ్మంలోని సత్తుపల్లిలో బుధవారంలో భారీ మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Ganja Smuggling
గంజాయి పట్టివేత
author img

By

Published : Nov 11, 2021, 10:38 AM IST

పోలీసులు ఎంత కట్టడి చేసినా... నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్న గంజాయి దందా మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో భారీ స్థాయిలో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దాని విలువ సుమారు కోటి రూపాయల పైమాటే ఉంటుందని వెల్లడించారు. తనిఖీల్లో భాగంగా అశ్వారావు పేట నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీని సత్తుపల్లి పట్టణ శివారులోని జేవీఆర్​ పార్క్​ ఎదురుగా పోలీసులు ఆపారు. గంజాయి ఉన్నట్లు తేలడంతో లారీతో పాటు మహారాష్ట్రకు చెందిన లారీ డ్రైవర్లు యోగేశ్ లింబాజీ, ఇర్ఫాన్‌ సాదర్‌​ను అదుపులోకి తీసుకొన్నట్లు సీఐ రమాకాంత్ తెలిపారు. నిందితులు ట్రాలీ లారీ ప్లాట్​ఫామ్ కింద భాగంలో.. ప్రత్యేకంగా వెల్డింగ్​తో తయారు చేసిన గదుల్లో.. 566 కిలోల గంజాయిని 250 పొట్లాలుగా పెట్టి తరలించేందుకు యత్నించినట్లు తెలిపారు. గంజాయి విలువ రూ.1.14 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కేసులో గణేష్ ఉబాడే అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి.. విచారణను కొనసాగిస్తామన్నారు.

దేశంలో గంజాయి వినియోగం రోజురోజుకీ పెచ్చరిల్లుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాని సాగు వ్యవస్థీకృతమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గంజాయిని కట్టడి చేయడంపై గత నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అటవీ (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) భూముల్లో గంజాయి సాగు చేస్తే పట్టాలు రద్దు చేస్తామని... రైతు బంధు, బీమా వంటివి నిలిపేస్తామని హెచ్చరించారు. గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు.

కూకటివేళ్లతో పెకలించాలి

గంజాయిని వివిధ రూపాల్లో వినియోగిస్తున్నవారు దేశం మొత్తంలో మూడు కోట్లకు పైగా ఉన్నారని సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ సర్వేలో వెలుగు చూసింది. వాస్తవంలో ఆ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు. పదేళ్ల నుంచి 75 సంవత్సరాల వయసు గల వారి వరకు గంజాయిని సేవిస్తున్నారు. ముఖ్యంగా యువత, కళాశాల విద్యార్థులు దీనికి ఎక్కువగా బానిసలవుతున్నారు. ప్రభుత్వాలు తలచుకుంటే గంజాయి సాగును కూకటివేళ్లతో పెకలించవచ్చు. ఆ దిశగా పటిష్ఠ కార్యాచరణ లోపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ద్వారా గతంలో ఏపీలోని మన్యం ప్రాంతాల్లో గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపారు. ఆ సమయంలో ఆ పంట బాగా తగ్గిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. గంజాయిని అరికట్టడంలో సర్పంచులను భాగస్వాములను చేస్తే- ఎవరి పరిధిలో వారు దాని సాగు జరగకుండా జాగ్రత్తలు తీసుకోగలరు. వారికి అది సాధ్యం కాకపోతే కలెక్టర్లు జోక్యం చేసుకుని, కఠిన నిర్ణయాలతో సాగును అడ్డుకోవచ్చు. పోలీసుల్లో చాలామంది గంజాయిని ఆదాయ వనరుగా భావిస్తున్నారే తప్ప- దాని వల్ల సమాజానికి వాటిల్లుతున్న నష్టాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రజారోగ్యాన్ని గుల్లబారుస్తున్న గంజాయి సాగు, వినియోగాలను సమూలంగా అడ్డుకోవడం అత్యవసరం. నాయకులు, అధికారులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అది అసాధ్యమేమీ కాదు!

ప్రాణాలకే ప్రమాదకరం

గంజాయి వాడకం అనేక అనర్థాలకు దారితీస్తుంది. బాధితుల్లో ఆందోళన, గుండె దడ, గుండెపోటు, మానసిక అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలం గంజాయి తీసుకుంటే కానబనాయిడ్‌ హైపరమెసిస్‌ సిండ్రోమ్‌ (సీహెచ్‌ఎస్‌) అనే రుగ్మతతో బాధపడతారు. పదే పదే వికారం కలుగుతూ వాంతులవుతాయి. కొన్ని సందర్భాల్లో అది మరణానికీ దారితీస్తుంది. ఒకటి రెండు వారాలు గంజాయి తీసుకుని ఆపేసిన వారిలోనూ భయం, వణుకు, నిద్రలేమి, ఆకలి తగ్గడం, చెమటలు పట్టడం, మానసిక పరిస్థితి సవ్యంగా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ద్రవ, స్ప్రే రూపంలో గంజాయి తీసుకుంటే- తలనొప్పి, మగత, పొడినోరు, వికారం, మతిస్థిమితం దెబ్బతినడం వంటివి తలెత్తుతాయి. గంజాయిని పొగ రూపంలో సేవిస్తే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. దీర్ఘకాలంలో ప్రాణాలే పోతాయి.

ఇదీ చూడండి: గుప్పుమంటున్న గంజాయి- యథేచ్ఛగా సాగు, రవాణా

PRATHIDWANI: గంజాయి సాగు, అక్రమ రవాణా మూలాలు ఎక్కడున్నాయి?

గంజాయి మొక్కల కలకలం.. గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే పెంపకం..

450 కిలోల గంజాయి తరలింపు.. సీజ్ చేసిన ఆబ్కారీ అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.