ETV Bharat / crime

suicide attempt: తల్లితో గొడవపడి ఆత్మహత్యాయత్నం.. సెల్​ఫోన్ సిగ్నల్స్ సాయంతో కాపాడిన పోలీసులు..

author img

By

Published : Jun 23, 2021, 7:32 PM IST

తల్లితో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు (suicide attempt). ఈ విషయాన్ని తమ్ముడికి ఫోన్ చేసి చెప్పాడు. సోదరుడి కోసం ఎంత వెతికినా జాడ లభించక పోలీసులను ఆశ్రయించాడు. చరవాణి సిగ్నల్ ఆధారంగా బాధితుడి జాడ కనుగొన్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన కీసర ఠాణా పరిధిలో జరిగింది.

dd
young committed suicide attempt

మేడ్చల్​ జిల్లా కీసర ఠాణా పరిధిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువకుడిని పోలీసులు కాపాడారు. కీసర పోలీస్​ స్టేషన్​ పరిధి దాయరకు చెందిన ప్రవీణ్....​ పాల వ్యాపారం చేస్తున్నాడు. పాడి గేదెలు కొనడం కోసం తన తల్లిని రూ. లక్షరూపాయలు అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడం వల్ల తల్లితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని (suicide attempt) తమ్ముడు నవీన్​కు ఫోన్​ చేసి చెప్పాడు.

సాంకేతిక సహకారంతో ఆచూకీ

​ అప్రమత్తమైన నవీన్​... అన్నకోసం గాలించగా ఆచూకీ దొరకలేదు. ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సెల్​ఫోన్​ సిగ్నల్​ ఆధారంగా బొమ్మలరామారం మండలం పెద్ద పర్వతాపురం సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకుని అపస్మారకస్థితిలో ఉన్న ప్రవీణ్​ను గస్తీ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన కానిస్టేబుళ్లు కృష్ణంరాజు, కుమారస్వామిని బాధితుడి తల్లిదండ్రులు, స్నేహితులు, వైద్యులు అభినందించారు.

ఇదీ చూడండి: Kidnap: నా భార్యను కిడ్నాప్​ చేశారు.. న్యాయం చేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.