ETV Bharat / crime

ఓఎల్​ఎక్స్​లో ద్విచక్రవాహనం విక్రయిస్తానని చెప్పి.. ఫొటోలు పంపి - ఓఎల్​ఎక్స్​ పేరిట మోసం

ఓఎల్​ఎక్స్​లో ద్విచక్రవాహనం విక్రయిస్తానని చెప్పి.. నగదు కాజేశారని ఓ మహిళ సైబర్​ క్రైంకు ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలు పంపి మహిళ నుంచి రూ.31 వేలను ఖాతాలో జమ చేయించుకున్నాడు.

cyber crime news
cyber crime news
author img

By

Published : Mar 24, 2021, 10:55 PM IST

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త ఎత్తుగడలు వేస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. పోలీసులు హెచ్చరికలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి.

cyber crime news
నిందితుడు పంపిన గుర్తింపు కార్డు

తాజాగా మేడ్చల్ జిల్లా జీడిమెట్ల సంజయ్ గాంధీ నగర్​కు చెందిన అనిత.. మంగళవారం ఓఎల్​ఎక్స్​లో యాక్టీవా ద్విచక్రవాహనాన్ని చూసింది. వెంటనే ఆ వ్యక్తికి సంప్రదించింది. తాను ఆర్మీలో పనిచేస్తున్నట్లు అనితను నమ్మబలికాడు. వాహన ఫొటోలు, నకిలీ ఆధార్​కార్డు సహా ఇతర వివరాలు పంపి బేరం కుదుర్చుకున్నాడు. ముందుగా కొంత డబ్బు పంపాలని అనితను కోరాడు. స్పందించిన ఆమె రూ.2 వేలను పంపింది. ఆ తర్వాత మరో మూడుసార్లు మొత్తంగా రూ.31 వేలును తీసుకొన్నాడు. మధ్యలో ద్విచక్రవాహనాన్ని డెలివరీ కోసం ప్యాక్​ చేసినట్లు ఫొటోలూ పంపి అనితను నమ్మించాడు.

cyber crime news
నిందితుడి ఫొటో

ఇలా కొద్ది రోజులు గడిచింది. అనంతరం ఫోన్​ చేసినా స్పందన లేకపోవడం వల్ల మోసపోయానని గ్రహించిన అనిత.. పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదుచేసుకున్న జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబరాబాద్ పరిధిలోని అన్ని ఠాణాల్లో ఇక నుంచి సైబర్​ క్రైం ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఓఎల్​ఎక్స్​లో ద్విచక్రవాహనం విక్రయిస్తానని చెప్పి.. ఫొటోలు పంపి

ఇవీచూడండి: లైవ్​ వీడియో: ఫుల్లుగా మద్యం తాగి ట్రాన్స్​ఫార్మర్​ ఎక్కి... ఆపై!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.