హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బర్కస్ ప్రాంతంలో పలువురు పేరుమోసిన రౌడీషీటర్లు ఉండగా... వారి ఇళ్లకు వెళ్లి సోదాలు నిర్వహించారు. రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా పెట్టిన పోలీసులు... అర్దరాత్రి వేళ ఇళ్లల్లో ఉన్నారా లేదా అని పరిశీలించారు.
రౌడీ షీటర్ల కుటుంబసభ్యులతో మాట్లాడి... వారి ప్రవర్తన గురించి అడిగి తెలుసుకున్నారు. నేరాలకు దూరంగా ఉండాలని డీసీపీ కౌన్సిలింగ్ ఇచ్చారు. నేరాలు కట్టడి చేసేందుకు రౌడీషీటర్ల ఇళ్లకు వెళ్లి వారితో పాటు కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ చేస్తున్నట్లు డీసీపీ వివరించారు. తనిఖీల్లో డీసీపీతో పాటు ఏసీపీ మజీద్ పాల్గొన్నారు.