ETV Bharat / crime

Police raid on tollywood club: పబ్​లో అశ్లీల నృత్యాలు, అసాంఘీక కార్యక్రమాలు.. - Police raid hyderabad pubs

Police raid on tollywood club: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన పబ్​పై టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు చేశారు. మహిళలతో.. అశ్లీల నృత్యాలతో పాటు.. అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ పబ్​పై గతంలోనూ దాడులు నిర్వహించగా.. పేరు మార్చి మళ్లీ అదే పంథా కొనసాగించగా.. పోలీసులు దాడి చేశారు. 33 మంది పురుషులు, 9 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

Police raid tollywood club in hyderabad Begumpet for obscene activities

author img

By

Published : Dec 11, 2021, 3:33 PM IST

Police raid on tollywood club: హైదరాబాద్ బేగంపేటలోని టాలీవుడ్ క్లబ్​ పబ్‌పై పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 33 మంది పురుషులతో పాటు 9 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. గతంలో ఇదే పబ్‌ను లిబ్సన్‌ పబ్‌ పేరుతో నిర్వహించిన నిర్వాహకులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చడంతో పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. తిరిగి అదే పబ్‌ను నిర్వాహకులు వేణుగోపాల్‌, సాయి భరద్వాజ్‌.. టాలీవుడ్‌ క్లబ్​​గా పేరుమార్చారు.

obscene activities in tollywood club pub: నిర్వాహకులు, పబ్‌ మేనేజర్‌ రాము కలిసి పబ్​లో మహిళలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. కురుస దుస్తులు ధరించే మహిళలకు రోజుకు 1000 రూపాయలు ఇస్తూ.. అసభ్యకరంగా నృత్యాలు చేయించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. అదుపులోకి తీసకున్న నిందితులను తదుపరి విచారణ నిమిత్తం పంజాగుట్ట పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ తెలిపారు.

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా..

illegal activities in Lisbon pub: 2019 డిసెంబర్​లోనూ లిస్బన్​ పబ్​పై పోలీసులు దాడులు నిర్వహించారు. అప్పుడు కూడా అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఆ సయంలో సుమారు 30 మంది మత్తులో ఉన్న మహిళలను గుర్తించగా... 21 మంది మహిళలు, 9 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. మిగతావాళ్లు తప్పించుకున్నారు. పబ్​పై కేసులు నమోదు చేశారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.