ETV Bharat / crime

POLICE RAID ON HORSE RIDING CLUB : హార్స్ రైడింగ్ క్లబ్​లో బర్త్​డే పార్టీ.. గంజాయితో... - police raid on horse riding club in ajij nagar

హార్స్ రైడింగ్ క్లబ్‌లో సోదాలు
హార్స్ రైడింగ్ క్లబ్‌లో సోదాలు
author img

By

Published : Oct 22, 2021, 9:22 AM IST

Updated : Oct 22, 2021, 12:35 PM IST

09:20 October 22

POLICE RAID ON HORSE RIDING CLUB : హార్స్ రైడింగ్ క్లబ్‌లో పుట్టినరోజు వేడుకలు..

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​ మండలం అజీజ్​నగర్​లోని హార్స్​రైడింగ్ క్లబ్​లో పోలీసులు సోదాలు(POLICE RAID ON HORSE RIDING CLUB) నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి జరిపిన ఈ సోదాల విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 25 మంది యువతీయువకులు కలిసి క్లబ్​లో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో వారు గంజాయి సేవిస్తున్నట్లు ఎస్​ఓటీ పోలీసులకు సమాచారం అందింది. 

వెంటనే ఆ క్లబ్​కు చేరుకున్న పోలీసులు సోదాలు(POLICE RAID ON HORSE RIDING CLUB) చేశారు. ఈ సోదాల్లో 20 గ్రాముల గంజాయి(cannabis seized) దొరికింది. గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆ యువతీయువకులను అరెస్టు చేశారు. అనంతరం వారిని స్థానిక పోలీస్ స్టేషన్​లో అప్పగించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గంజాయిని ఎవరెవెవరు సేవించారు? ఎక్కడి నుంచి విక్రయించారు? గంజాయి తీసుకోవడమేనా లేదా సరఫరా కూడా చేస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Last Updated : Oct 22, 2021, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.