రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మధ్య మానేరు ప్రాజెక్టులో ఈనెల 15న కరీంనగర్ జిల్లాకు చెందిన సాయికృష్ణ ఆత్మహత్య చేసుకోడానికి నీటిలో దూకాడు. ఇది గమనించిన స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అదే సమయంలో చూసేందుకు వచ్చిన రాజశేఖర్ రెడ్డి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు.
ఇద్దరి కోసం స్థానికులు, పోలీసులు గాలించినా ఆచూకీ దొరకలేదు. రెండు రోజుల పాటు సాగిన సహాయకచర్యల్లో రాజశేఖర్ రెడ్డి మృతదేహాన్ని స్థానిక జాలర్ల సహాయంతో పోలీసులు వెలికి తీశారు. సాయికృష్ణ మృతదేహం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయంతో గాలించి వెలికి తీశారు.
ఇదీ చూడండి: విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ మృతి