ETV Bharat / crime

ఏవోబీలో రెండు గంటలపాటు ఎదురుకాల్పులు.. - ఏవోబీ మావోయిస్టులు, పోలీసులకు మధ్య రెండు గంటల పాటు ఎదురు కాల్పులు

ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో తుపాకీ గ‌ర్జించింది. మావోయిస్టులు పోలీసుల‌కు మ‌ధ్య సుమారు రెండు గంట‌ల పాటు ఎదురుకాల్పులు జ‌రిగాయి. కాల్పుల అనంతరం మావోయిస్టులు త‌ప్పించుకోగా వారి కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేపట్టారు.

firing at aob
ఏవోబీలో రెండు గంటలపాటు ఎదురుకాల్పులు.. టిఫిన్​ బాంబు స్వాధీనం
author img

By

Published : Mar 14, 2021, 10:50 PM IST

ఏవోబీ మావోయిస్టులు, పోలీసులకు మధ్య రెండు గంటలపాటు ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల క‌ద‌లిక‌పై స‌మాచారం అందుకున్న ఆంధ్రా-ఒడిశా పోలీసులు సంయుక్తంగా గాలించారు. మ‌ల్క‌న్‌గిరి జిల్లా క‌టాఫ్ ఏరియాలోని ముదిలిగుడా-నారింగ‌జోలా అట‌వీప్రాంతంలో గాలింపు చ‌ర్య‌లు నిర్వ‌హిస్తుండ‌గా మావోయిస్టులు పోలీసుల‌పై కాల్పులు జరిపారు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసు బ‌ల‌గాలు ఎదురు కాల్ప‌ులు జరిపారు.

సుమారు రెండు గంట‌లు పాటు కాల్పులు కొనసాగాయి. మావోయిస్టులు త‌ప్పించుకున్నారు. ఘ‌ట‌నాస్థ‌లంలో ఓ టిఫిన్ బాంబు, రెండు డిటోనేట‌ర్లు విప్ల‌వ‌ సాహిత్యం స్వాధీనం చేసుకున్న‌ట్లు మ‌ల్క‌న్‌గిరి జిల్లా ఎస్పీ రిషికేష్ కిల్లారి తెలిపారు.

ఇవీచూడండి: చనిపోయిన పావురం తీయడానికెళ్లి లైన్‌మన్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.