ETV Bharat / crime

POCSO: బాధితులను రక్షించేందుకు... పోలీసుల కొత్తపంథా - telangana news

పసి కందులు, చిన్నారులపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలిసినవారే కదా అని అనుకుంటే.. నమ్మించి గొంతుకోస్తున్నారు. వావివరసలు మరచి అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లాలంటే.. తల్లిదండ్రులు జంకాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలా లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురైన చిన్నారులను రక్షించేందుకు పోలీసులు కొత్తపంథా అనుసరిస్తున్నారు.

POCSO
పోలీసుల కొత్తపంథా
author img

By

Published : Jul 26, 2021, 8:43 AM IST

  • అమీర్‌పేటలో కొద్దినెలల క్రితం పదేళ్ల బాలుడిపై అతడికి వరసయ్యే మామ అత్యాచార యత్నం చేశాడు. భయపడిన బాలుడు రెండు రోజులపాటు షాక్‌లోనే ఉన్నాడు. పోలీసులు మూడు రోజుల్లో నిందితుడిని అరెస్ట్‌ చేశారు. బాలుడు కోలుకున్నాక అమీర్‌పేటలో ఉంచకుండా తల్లిదండ్రుల సమ్మతితో ఆ బాలుడిని శివార్లలోని ఓ కార్పొరేటు స్కూల్‌లో చేర్పించారు.
  • బోయిన్‌పల్లిలో తల్లిదండ్రులతో ఉంటున్న 13 ఏళ్ల బాలికపై కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆమె మేనమామ కొద్దినెలల క్రితం అత్యాచారం చేశాడు. నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. బాలికను రంగారెడ్డి జిల్లాలోని ఓ ఆశ్రమ పాఠశాలలో చేర్పించారు. చదువు పూర్తయ్యేంత వరకూ పోలీసులే సంరక్షణ బాధ్యతలు చేపట్టారు.

చిన్నారులపై అత్యాచార యత్నాలు.. లైంగిక వేధింపులు.. అత్యాచారాల ఘటనలపై సత్వరం స్పందించి బాధితులను రక్షించేందుకు పోలీసులు కొత్త పంథా అనుసరిస్తున్నారు. నగరం, శివారు ప్రాంతాల్లో చిన్నారులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో బాధితులకు న్యాయం జరిగేందుకు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని అన్ని ఠాణాల ఇన్‌స్పెక్టర్లు చిన్నారుల సంక్షేమ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. పసిమొగ్గలపై పైశాచికత్వాన్ని నిర్మూలించేందుకు పోక్సో (చిన్నారులపై లైంగిక దాడుల నిరోధ చట్టం)ను కఠినంగా అమలు చేస్తూ బాధితులకు న్యాయం జరిగేవరకూ చట్టపరంగా వారికి అండగా ఉంటున్నారు.

ఇదీ చూడండి: ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి జీవిత ఖైదు

దుర్మార్గులకు శిక్షపడేలా..

చిన్నారులు, బాలికలు, విద్యార్థులపై లైంగికదాడులు జరిగినప్పుడు తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు బాధితులు చెప్పినప్పుడే బహిర్గతమవుతున్నాయి. దుర్మార్గులకు భయపడుతున్న చిన్నారులు ఆలస్యంగా తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఠాణాల చుట్టూ తిరగాలన్న భావనతో 50శాతం మంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడంలేదు. దుర్మార్గులకు శిక్షలు పడాలంటే ఠాణాలకు బాధితులను తీసుకురావాలని, వివరాలను గోప్యంగా ఉంచుతామంటూ పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ఠాణాలకు వచ్చాక ప్రత్యేకంగా వారి కోసం ఇన్‌స్పెక్టర్లుంటారు. మహిళా ఎస్సైలు, కానిస్టేబుళ్ల సాయంతో చిన్నారులు, వారి తల్లిదండ్రులు, సంరక్షకులను భరోసాకేంద్రానికి తీసుకెళ్తున్నారు. చిన్నారులపై నేరాలు, అత్యాచారాలు, యత్నాలపై సమాచారం తెలిసినా చెప్పకపోతే దోషులుగా భావిస్తామని పోలీసులు చెబుతున్నారు. పోక్సో చట్టం ద్వారా ప్రధాన నిందితులతోపాటు సమాచారం చెప్పనివారిపై చర్యలు తీసుకుంటున్నారు.

  • ఇళ్లు.. అపార్ట్‌మెంట్లు, కార్యాలయాల్లో చిన్నారులు, మైనర్లపై నేరాలకు పాల్పడిన సమాచారం పోలీసులకు వెంటనే రాదు. అక్కడున్న పిల్లల ద్వారా ఇతరులకు తెలిసినా మనకెందుకులే అని వదిలేస్తున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసినప్పుడు విచారణ సందర్భంగా వారికి ముందే తెలుసని తేలితే ఘటనతో సంబంధం లేకపోయినా శిక్ష తప్పనిసరి.
  • పరిశ్రమలు, కర్మాగారాలు, హోటళ్లు, అపార్ట్‌మెంట్లలో మైనర్లతో పనులు చేయించుకుంటూ వారిని లైంగికంగా వేధిస్తున్న సమాచారం పోలీసులకు ఆలస్యంగా తెలుస్తోంది. నేరం బహిర్గతమైనప్పుడు ఫలానా వారికి ఈ విషయం ముందే తెలుసని బాధితులు, తల్లిదండ్రులు చెప్పినా వారిపై చర్యలు తీసుకోనున్నారు.

ఇదీ చూడండి: మహిళా నేతపై ఎమ్మెల్యే కొడుకు లైంగిక దాడి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.