సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో కారులో అక్రమంగా తరలిస్తోన్న 2.922 టన్నుల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
పట్టుబడ్డ నకిలీ పత్తి విత్తనాల విలువ సుమారు రూ. 70 లక్షల వరకు ఉంటుందని జిల్లా ఎస్పీ భాస్కరన్ తెలిపారు. ముందుగా పట్టుబడ్డ నిందితుడి సమాచారంతో.. హైదరాబాద్, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో దాడులు జరిపి నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని నాచవరం, కుఫ్టీగి కేంద్రంగా ఇవి తయారవుతోన్నట్లు వివరించారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: కొవిడ్‌తో భార్య మృతి.. భర్త అదృశ్యం