అక్రమ వ్యాపారాలకు పాల్పడితే బాధ్యులైన వారిపై కేసులతోపాటు కఠిన చర్యలు తప్పవని తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో పట్టుబడిన నల్లబెల్లం, నిందితుల అరెస్టు వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వెల్లడించారు.
అనుమానాస్పదంగా కనిపించడం..
మరిపెడ మండలం ఎల్లంపేట, మాకులతండా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. రెండు వాహనాలు అనుమానాస్పదంగా కనిపించడంతో వాటిలో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో డీసీఎం వాహనం, గూడ్స్ ట్రాలీలో అక్రమంగా తరలిస్తున్న 75.5 క్వింటాళ్ల నల్లబెల్లం, 5.5 క్వింటాళ్ల పటికను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.8.10 లక్షలు ఉంటుందని తెలిపిన డీఎస్పీ.. నలుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వివరించారు.
ఇదీ చదవండి:'ప్రేమ వ్యవహారమే యువకుని హత్యకు కారణమైంది'