జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అధిక లోడుతో వస్తున్న 4 ఇసుక లారీలను పోలీసులు సీజ్ చేశారు. వాహనాలను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు అప్పగించారు. లారీల్లో అధిక లోడుతో.. ఇసుక తరలిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని భూపాలపల్లి ఎస్ఐ ఉదయ్ కిరణ్ స్థానికులను కోరారు. వాహనాల ఓనర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: బంగారం దొంగతనం చేశావని అవమానించడంతో కూలీ ఆత్మహత్య