ETV Bharat / crime

యాప్​లేమో వందలు.. కొల్లగొట్టిందేమో రూ.16 వేల కోట్లు!

పూచీకత్తు లేకుండానే రుణాలు.. ఆటాడితే చాలు రూ.లక్షలు.. మదుపు చేస్తే  కళ్లు చెదిరే లాభాలంటూ విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులకు ఆశచూపి.. యాప్‌ల ద్వారా రూ.వేలకోట్ల లావాదేవీలు నడిపించి, అందినంతా కొల్లగొట్టిన నేరస్థుల వెనుక చైనీయులున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.

police-have-revealed-that-the-chinese-are-behind-those-who-cheat-people-in-the-name-of-apps
యాప్‌లు... వందలు కొల్లగొట్టింది.. రూ.16 వేల కోట్లు!
author img

By

Published : Aug 18, 2021, 6:44 AM IST

Updated : Aug 18, 2021, 7:03 AM IST

మాల్‌ 008 యాప్‌ ద్వారా మోసాలు చేస్తున్న ఇద్దరు నిందితులు శ్రీనివాసరావు, విజయ్‌కృష్ణను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇటీవలే అరెస్ట్‌ చేశారు. ఈ యాప్‌ వెనుక ఇద్దరు చైనీయులున్నారని, వీరికీ రుణయాప్‌లతో ఇప్పటికే వేలకోట్లు దోచేసిన చైనీయులకు మధ్య సంబంధాలున్నాయని ఆధారాలు సేకరించారు. నేరగాళ్లు ఒక్క హైదరాబాద్‌లోనే రూ.32,850 కోట్ల లావాదేవీలు నడిపించినట్లు, అందులో సుమారుగా సగం దోచేసినట్లు గుర్తించారు.. ఈ సమాచారాన్ని కేంద్ర నిఘా అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు నివేదించారు. ఈ కేసుల్లో మరో ఐదుగురు చైనీయులను అరెస్ట్‌ చేయాల్సి ఉందని వివరించారు.

పథకం ప్రకారం సంస్థలు... కాల్‌ సెంటర్లు

ఆన్‌లైన్‌ గేమింగ్‌, రమ్మీ, క్రికెట్‌ బెట్టింగ్‌లలో రూ.వందల కోట్ల టర్నోవర్‌ ఉందని తెలుసుకున్న చైనీయులు.. పథకం ప్రకారం 2019 అక్టోబరులో దిల్లీకి వచ్చారు. హాంకాంగ్‌లో పనిచేస్తున్న జెన్నీఫర్‌, మరో ఇద్దరు చైనీయులు దిల్లీకి చేరుకుని డిసెంబరులో రుణయాప్‌ల కోసం నాలుగు సంస్థలను ప్రారంభించారు. దీనికి ముందు లింక్‌యున్‌, డోకీపే మరో ఎనిమిది పేర్లతో చైనీయులు ఆర్థికసేవా కంపెనీలను మొదలుపెట్టారు. చైనీయుడు యాన్‌హువో వ్యవహారాలను పర్యవేక్షించేవాడు. గతేడాది ఆగస్టులో యాన్‌హువో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు దర్యాప్తు జరుగుతుండగానే జెన్నీఫర్‌ రుణయాప్‌ల దురాగతాలు వెలుగుచూడడంతో గతేడాది డిసెంబరులో సైబర్‌క్రైమ్‌ పోలీసులు చైనీయుడు ల్యాంబో సహా 16 మందిని అరెస్ట్‌ చేశారు.

గూగుల్‌కీ చిక్కరు.. ఎలాగంటే

రుణాలు, పెట్టుబడి మోసాలు, డేటింగ్‌ యాప్‌లను తయారుచేస్తున్న చైనా కంపెనీలు.. వాటిని గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఉంచడం లేదు. అందులో ఉంచితే యాప్‌ తయారీదారుల వివరాలు, చిరునామాలు తప్పక ఇవ్వాలి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే దొరికిపోతామని చైనీయులు వీటిని వాట్సాప్‌, టెలిగ్రాం లింక్‌ల ద్వారా వారికి పంపారు. అనంతరం బాధితులను సభ్యులుగా చేర్పిస్తూ.. రూ.లక్షల్లో దోచేశారు.

వందలాది రుణయాప్‌లను సృష్టించిన చైనీయులు.. బాధితులకు రూ.లక్షల్లో రుణమిచ్చి గడువులోగా చెల్లించకపోతే..ఆ అప్పును తీర్చేందుకు మరో యాప్‌ ద్వారా రుణమివ్వడం, దాన్ని కట్టేందుకు ఇంకో యాప్‌ ద్వారా డబ్బు పంపడం ఇలా ఒక్కో బాధితుడికి 20-30 యాప్‌ల ద్వారా రుణాలిచ్చారు.

యాప్​ల దందాల వివరాలు

ఇదీ చూడండి: School Rationalization: టీచర్‌ పోస్టుల హేతుబద్ధీకరణ, బడుల విలీనానికి సర్కారు కసరత్తు

Last Updated : Aug 18, 2021, 7:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.