ETV Bharat / crime

Cheater: అతని పియానోకి 19 మంది పడిపోయారు.. చివరికి పెళ్లైన వాళ్లనీ... - a man cheated 19 peoples

Police have registered a case against a man who cheated on 19 women in nalgonda district
19 మంది మహిళలను మోసం చేసిన నిత్యపెళ్లికొడుకు
author img

By

Published : Nov 9, 2021, 10:17 AM IST

Updated : Nov 9, 2021, 6:03 PM IST

10:13 November 09

నల్గొండలో నిత్య పెళ్లికొడుకుపై పోలీసులకు ఫిర్యాదు

Police have registered a case against a man who cheated on 19 women in nalgonda district
19 మంది మహిళలను మోసం చేసిన నిత్యపెళ్లికొడుకు

అతను ఓ చర్చిలో పియానో వాయిస్తూ.. అమ్మాయిలకు వలవిసురుతాడు. అమ్మాయిలే కాదు.. పెళ్లయిన మహిళలను సైతం... తన పియానోతో బుట్టలో వేసుకుంటాడు.  అలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు... ఏకంగా 19 మందిని తన ప్రేమలో పడేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు(Believed to be getting married). ఇంకేముంది.. నమ్మిన ఆ 19 మంది మహిళలు మోసపోయారు. 

అసలేం జరిగిందంటే...

పెళ్లి పేరుతో నల్గొండలో మహిళలను మోసం(Cheater) చేసిన విలియమ్స్‌ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. స్థానికంగా ఉండే ఓ చర్చిలో పియానో వాయించే అతను పలువురు మహిళలను మోసం చేసినట్లు తెలుస్తోంది. చర్చికి వచ్చే యువతులు, మహిళలను విలియమ్స్‌ లోబరుచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ బాగోతమంతా ఓ మహిళ  ఫిర్యాదుతో... బయటకు వచ్చింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు... విలియమ్స్​ను అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. ఇంతలో నిందితుడు.. గుండెపోటు వచ్చిందంటూ... ఆసుపత్రిలో చేరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

డబ్బు కోసమే ఇదంతా....

డబ్బు కోసమే తన భర్తపై కేసు పెట్టిందని విలియమ్స్ భార్యా శ్రీలత (20) ఆరోపిస్తుంది. గత కొంతకాలంగా బాధిత మహిళ కుటుంబానికి మా ఆయన ఎంతో సాయం చేశాడని పేర్కొంది. కేవలం ఆర్థికంగా సహాయం చేశాడే తప్ప.. ఆమెను మోసం చేయలేదని తెలిపింది. అదంతా అవాస్తవమని పేర్కొంది. గత నెల 25న మేము ప్రేమ వివాహం(Love marriage) చేసుకున్నామని... నేనే విలియమ్స్ మొదటి భార్యను అని తెలిపింది. ఆమె డబ్బు కోసమే తన భర్తపై ఆరోపణలు చేస్తుందని పేర్కొంది. ఒకసారి రూ. 70 లక్షలు, మరోసారి రూ.  20 లక్షలు ఇవ్వమని డిమాండ్‌ చేసిందని విలియమ్స్ భార్యా తెలిపింది. 

 ఇదీ చదవండి : CyberCriminals New Plan: సిమ్​ బ్లాక్​ చేసి... మహిళకు రూ.24 లక్షలు టోకరా

Last Updated : Nov 9, 2021, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.