న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నిందితులు కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్, శివందుల చిరంజీవిలకు నేడు కస్టడీ ముగిసింది. వారిని మంథని కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. నిందితులను 7 రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించారు.
బుధవారం రామగుండం అడ్మిన్ డీసీపీ అశోక్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ ఆధ్వర్యంలో నిందితులతో సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. రామగిరి మండలం కల్వచర్ల వద్ద సంఘటన స్థలానికి తీసుకెళ్లి వామన్‌రావు వాహనాన్ని అడ్డగించిన, హత్య చేసిన తీరుపై (సీన్ ఆఫ్ అఫెన్స్) సమగ్రంగా ఆరా తీశారు. మొత్తం విచారణను వీడియోలో రికార్డు చేశారు.
ఇంకా ఈ కేసులో పరోక్షంగా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. వామన్‌రావుతో తమకు వ్యక్తిగతంగా ఉన్న పగ, ప్రతీకారాల కారణంగానే హత్యకు ప్రణాళిక వేశామని, ఆయన భార్య నాగమణి కూడా న్యాయవాది కావడం, ఆమెను కూడా చంపితే ప్రధాన సాక్ష్యం ఉండదనే ఉద్దేశంతోనే ఇద్దరినీ చంపేశామని నిందితులు తెలిపినట్లు సమాచారం. ఈ కేసులో పూర్తి స్థాయిలో సత్వరమే విచారణ పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశించడంతో మరింత పకడ్బందీగా విచారణ కొనసాగిస్తున్నారు.
సంబంధిత కథనాలు: '
- మంథనిలో లీగల్ ఫ్యాక్షన్ నడుస్తోంది'
- స్థానికంగానే న్యాయవాద దంపతుల హత్య కేసు దర్యాప్తు..!
- లైవ్ వీడియో: న్యాయవాద దంపతుల హత్య దృశ్యాలు
- 'వామనరావు హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలి'
- న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితులకు కస్టడీ
- "హత్యకు ముందు ఆ తర్వాత"... రిమాండ్ రిపోర్టులో ఏముందంటే..
- బిట్టు శ్రీను... లాయర్ దంపతుల హత్య కేసులో కొత్త పేరు