ETV Bharat / crime

ఎనిమిది గంటల్లో హయత్ నగర్​ బాలిక కిడ్నాప్ కేసు ఛేదన

హయత్ నగర్​లో ఓ తొమ్మిదేళ్ల బాలిక కిడ్నాప్ కేసుకు పోలీసులు పోలీసులు 8 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కేసు విచారిస్తున్నారు.

hayathnagar girl kidnap case
హయత్ నగర్​ పోలీస్ స్టేషన్
author img

By

Published : Apr 7, 2021, 4:12 AM IST

ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ తొమ్మిదేళ్ల బాలిక కిడ్నాప్​కు గురైన కేసును హయత్ నగర్ పోలీసులు 8 గంటల్లోనే ఛేదించారు. బాధితురాలిని క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.

పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని తట్టిఅన్నారం ఆర్​కే నగర్​లో నివాసముంటున్న రాజు ( 45 ) వృత్తిరీత్యా చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. మద్యం మత్తులో రాజు బాలికను షాపు వద్దకు తీసుకెళ్లి కేకును ఇప్పించాడు. ఆటోలో ఎక్కించుకుని బాలికను సినిమా చూడటానికి తీసుకెళ్లాడు. అనంతరం బాలికను తీసుకుని వచ్చి హయత్ నగర్​లోని లెక్చరర్ కాలనీ బస్టాండ్ వద్ద ఉంచాడు. మంగళవారం తెల్లవారుజామున బస్టాండ్​లో బాలికతోపాటు రాజు నిద్రలేచి చూస్తుండగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులు ఉన్నట్లు వెల్లడించారు.కేసు నమోదు చేసుకుని రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి:'మహా'లో కరోనా పంజా- కొత్తగా 55 వేల కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.