ETV Bharat / crime

బొల్లారం హత్య కేసు: భార్య, బావమరిదే చంపేశారు!

author img

By

Published : Feb 9, 2021, 12:35 PM IST

Updated : Feb 9, 2021, 4:18 PM IST

బొల్లారంలో సోమవారం ఉదయం దారుణ హత్యకు గురైన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మృతుడు విజయ్ సింగ్​ని అతని భార్య, బావమరిది చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. లక్ష రూపాయల విషయంలో తలెత్తిన వివాదంలో నిందితులు ఈ ఘటనకు ఒడిగట్టినట్లు డీఎస్పీ వెల్లడించారు.

police-have-cracked-the-bollaram-murder-case-and-recognise-the-deceased-person-through-cc-tv-in-hyderabad
బొల్లారం హత్య కేసు: భార్య, బావమరిదే చంపేశారు!
police-have-cracked-the-bollaram-murder-case-and-recognise-the-deceased-person-through-cc-tv-in-hyderabad
సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలు

సంగారెడ్డి జిల్లా బొల్లారం హత్య కేసు చిక్కుముడి వీడింది. మృతుడు విజయ్‌సింగ్‌ను అతని భార్య, బావమరిదితో పాటు మరో ఇద్దరు మహిళలు కలిసి హత్య చేసి... అనంతరం కాల్చివేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న మృతుడు మద్యం సేవించి రూ.లక్ష అప్పు విషయంలో వేధింపులకు పాల్పడుతుండడం వల్ల... నిందితులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పటాన్​చెరు డీఎస్పీ భీంరెడ్డి తెలిపారు.

ఆదివారం తెల్లవారుజామున ఊపిరాడకుండా చేసి హత్య చేశారని వెల్లడించారు. వీరికి పద్మ, లక్ష్మి అనే ఇద్దరు మహిళలు సహకరించారని డీఎస్పీ పేర్కొన్నారు. విజయ్‌సింగ్ చనిపోగానే సైకిల్‌పై మృతదేహాన్ని ఐడీఏ బొల్లారం ఓఆర్‌ఆర్‌ పక్కన పడేసి కృష్ణ కాల్చివేశాడని డీఎస్పీ వివరించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: '30ఏళ్ల కష్టం.. 30నిమిషాల్లో దోచేశారు'

Last Updated : Feb 9, 2021, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.