ETV Bharat / crime

బ్లాక్​ ఫంగస్​ ఇంజక్షన్లు బ్లాకులో అమ్ముతున్న ముఠా అరెస్ట్​

బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లను అధిక ధరలకు నల్లబజారులో విక్రయిస్తున్న అయిదుగురిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి లైపోసోమల్ యాంపోటెరిసిన్-బీ ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Jun 13, 2021, 10:29 PM IST

బ్లాక్​ ఫంగస్​ ఇంజక్షన్లు బ్లాకులో అమ్ముతున్న ముఠా అరెస్ట్​
బ్లాక్​ ఫంగస్​ ఇంజక్షన్లు బ్లాకులో అమ్ముతున్న ముఠా అరెస్ట్​

బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే లైపోసోమల్ యాంపోటెరిసిన్-బీ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఆదివారం బీకేగూడ ప్రాంతంలో అయిదుగురు సభ్యులు గల ముఠాను అరెస్టు చేశారు. బీకేగూడలో నివసించే కృష్ణా జిల్లా, గుడివాకు చెందిన వల్లపోతుల వేణుగోపాల్ (40), మెడికల్ ఏజెంట్ గాజుల నవీన్(29), కారు డ్రైవర్ వర్రె అశోక్(29), సాఫ్ట్​వేరు ఉద్యోగి కందుకూరి ప్రసాద్(36), ఎరువుల వ్యాపారి బొమ్మశెట్టి హరీష్(28)లు ముఠాగా ఏర్పడి ఒక్కో ఇంజకనన్ను రూ.35వేల చొప్పున విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

వారి వద్ద నుంచి 9 లైపోసోమల్ యాంపోటెరిసిన్-బి ఇంజక్షన్లు, ఐదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం నిందితులను ఎస్సార్‌నగర్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.

ఇదీ చదవండి: 'జీ7కు భారత్ సహజ భాగస్వామి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.