murder case of forest range officer: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ అధికారిని దారుణంగా హతమార్చిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చంద్రుగొండ మండలం పోకలగూడెం ఫారెస్ట్ బీట్‌లోని ప్లాంటేషన్ పనులను సందర్శించేందుకు.. రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, సెక్షన్ ఆఫీసర్ రామారావు వెళ్లారు. ఇదే సమయంలో ఎర్రబోడు గొట్టికాయ గుంపు దగ్గరలో ప్లాంటేషన్‌లో గొత్తికోయలు మడకం తుల, పోడియం నంగా.. పశువులను మేపుతుండటం గమనించారు.
అక్కడి నుంచి వారిని వెళ్లిపోవాలని అధికారులు సూచించగా.. ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడినట్లు కొత్తగూడెం ఎస్పీ వినీత్ తెలిపారు. వీడియోలు రికార్డు చేస్తున్న శ్రీనివాస్‌రావుపై వేట కొడవళ్లతో దాడి చేయటంతో ఆయన తీవ్రంగా గాయపడి చనిపోయినట్లు తెలిపారు. నిందితులను అరెస్టుచేసి.. వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
"చంద్రుగొండ మండలం పోకలగూడెం ఫారెస్ట్ బీట్‌లోని ప్లాంటేషన్ పనులను సందర్శించేందుకు.. రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, సెక్షన్ ఆఫీసర్ రామారావు వెళ్లారు. ఇదే సమయంలో ఎర్రబోడు గొట్టికాయ గుంపు దగ్గరలో ప్లాంటేషన్‌లో గొత్తికోయలు మడకం తుల, పోడియం నంగా.. పశువులను మేపుతుండటం అధికారులు గమనించారు. అక్కడి నుంచి వారిని వెళ్లిపోవాలని సూచించగా.. వారిపై వేట కొడవళ్లతో దాడి చేసి హతమార్చారు". - వినీత్, కొత్తగూడెం ఎస్పీ
ఇది జరిగింది: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల వివాదం ఓ అధికారి ప్రాణాలు బలిగొంది. అటవీ భూములను కాపాడేందుకు ఎదురొడ్డిన అటవీ రేంజ్ అధికారి శ్రీనివాసరావు విధినిర్వహణలోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. పోడుభూముల సాగుదారులు కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే తుదిశ్వాస విడిచారు.
వివరాల్లోకి వెళితే.. చంద్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతం ఎర్రబోడు సమీపంలో అటవీశాఖ అధికారులు నాటిన మొక్కలు తొలగించేందుకు మంగళవారం ఉదయం పోడుభూముల సాగుదారులు యత్నించారు. వారిని అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులు శ్రీనివాసరావు, రామారావుపై మూకుమ్మడిగా దాడికి యత్నించడంతో బెండాలపాడు అటవీశాఖ సెక్షన్ అధికారి రామారావు అక్కడి నుంచి తప్పించుకున్నారు.
మొక్కలు తొలగించవద్దని చెప్పే లోపే అక్కడే ఉన్న శ్రీనివాసరావుపై కత్తులు, గొడ్డళ్లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. మెడ భాగంలో బలమైన గాయాలై తీవ్ర రక్తస్రావం కావటంతో వెంటనే ఆయన్ను చంద్రుగొండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడనుంచి అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో తుదిశ్వాస విడిచారు.
ఇవీ చదవండి: