ETV Bharat / crime

షోరూంలో 432 ఫోన్లు చోరీ.. పట్టుకున్నవి రెండు.. మిగతావి ఎక్కడ? - Cell phone thieves in Hyderabad

ECIL theft case in Hyderabad: హైదరాబాద్‌ ఈసీఐఎల్​లోని బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూంలో గత నెల 21న జరిగిన చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ముఠాకు చెందిన ప్రధాన నిందితుడితో పాటు మరొకరిని అరెస్టు చేశారు. వేలిముద్ర ఆధారంగా మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో గాలించి నిందితులను అరెస్టు చేశారు. నేరస్థులను పట్టుకోవడం కోసం 500కుపైగా సీసీటీవీ కెమెరాలు తనిఖీ చేశామని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ స్పష్టం చేశారు.

ECIL theft case in Hyderabad
ECIL theft case in Hyderabad
author img

By

Published : Oct 6, 2022, 3:11 PM IST

Updated : Oct 6, 2022, 6:43 PM IST

ECIL theft case in Hyderabad: బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూంలో 70లక్షల విలువైన చరవాణులు చోరీ చేసిన ముఠా ఆటకట్టించారు పోలీసులు. గత నెల 21న హైదరాబాద్‌ ఈసీఐఎల్​లోని అర్ధరాత్రి చోరీ జరిగింది. 70లక్షల విలువైన చరవాణులు ఎత్తుకెళ్లారు. ఐఫోన్, ఒప్పో, వన్ ప్లస్, వివో బ్రాండ్లకు చెందిన చరవాణులు చోరీకి గురైనట్లు స్టోర్‌ మేనేజర్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎస్​ఓటీ, సీసీఎస్​, కుషాయిగూడ పోలీసులు మొత్తం కలిపి 10బృందాలు నిందితుల కోసం గాలించాయని మహేశ్‌ భగవత్‌ తెలిపారు. నిందితులను పట్టుకోవడం కోసం 500కుపైగా సీసీటీవీ కెమెరాలు తనిఖీ చేసామని మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు.

వేలి ముద్రల ఆధారంగా నిందితులు గుర్తింపు : మొదట తెలిసినవాళ్ల పనే అనే కోణంలో విచారణ చేయగా.. ఆ తర్వాత వేలి ముద్రలు, సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసినట్లు వెల్లడించారు. ఒక వేలి ముద్ర ఔరంగబాద్ వద్ద ఓ కేసులో ట్రేస్ అయింది. ముంబైలోని మరో పోలీస్‌ స్టేషన్‌లోనూ ఆ వేలి ముద్రతో సరిపోయింది. అక్కడ తీసుకున్న వివరాల ఆధారంగా నిందితుడి ఆచూకీ కనుగొన్నామని మహేశ్‌ భగవత్‌ తెలిపారు. జార్ఖండ్‌కి చెందిన నేరస్థులపనేనని తెలిసి అక్కడికి పోలీసు బృందాలు వెళ్లాయని.. స్థానిక పోలీసుల సాయంతో ప్రధాన నిందితుడు సత్తార్‌ను పట్టుకున్నామని వెల్లడించారు.

అలం గ్యాంగ్ ముఠా పని: అతడిచ్చిన సమాచారంతో మాల్డా గ్రామంలో ఆసీదుల్ షేక్ అనే మరో నిందితున్ని అరెస్టు చేశారు. ఈ ముఠాకి అలం గ్యాంగ్ అని పేరు ఉన్నట్లు మహేశ్‌ భగవత్‌ తెలిపారు. బ్యాంకులు, జ్యూవెల్లరీ, మొబైల్ షాపుల గ్రిల్స్ తొలగించి చోరీ చేయడంలో ఈ ముఠా ఆరితేరిందని మహేశ్‌ భగవత్‌ పేర్కొన్నారు. చోరి చేసిన వాటిని నేపాల్, బంగ్లాదేశ్‌కి తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ ముఠా బంగ్లాదేశ్ సరిహద్దుకు 3 కిలోమీటర్ల దూరంలో నివసిస్తోంది. బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూంలో 432 చరవాణులు చోరీ అయ్యాయి.

పోయినవి 432 ఫోనులు పట్టుకున్నవి 2 : చరవాణులు వాటిని నిందితులు బంగ్లాదేశ్‌కు తరలించారు. అందువల్లే చోరీ అయిన వాటిలో రెండు సెల్ ఫోన్లను మాత్రమే పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 80 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మొదట చోరి చేయాల్సిన ప్రాంతాన్ని ఎంచుకుని రెక్కీ చేస్తారు. సమీపంలోనే గదిని అద్దెకు తీసుకుని చోరీ చేస్తారని పోలీసులు తెలిపారు.

"ఝార్ఖండ్‌లో సాహెబ్ గంజ్​​ అనే జిల్లా ఉంది. ఇది బంగ్లాదేశ్​కి సరిహద్దు జిల్లా.. నిందితులు అక్కడే ఉంటున్నారు. బ్యాంకులు, జ్యువెల్లరీ, మొబైల్ షాపుల గ్రిల్స్ తొలగించి చోరీ చేయడంలో ఈ ముఠా ఆరితేరింది. వారు దొంగిలించి వాటిని వెంటనే బంగ్లాదేశ్​, నేపాల్​ దేశాలకు తరలించేస్తారు. పక్క సమాచారంతో ప్రత్యేక బృందాలతో మేము వారిని పట్టుకున్నాం.. వారి దగ్గర ఆయుధాలు ఉన్నాయి. వారిని అరెస్ట్​ చేయడానికి వారం రోజులు పట్టింది."- మహేశ్​​ భగవత్​, రాచకొండ సీపీ

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఫోన్ల చోరీ కేసును ఛేదించిన పోలీసులు

ఇవీ చదవండి:

Last Updated : Oct 6, 2022, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.