ETV Bharat / crime

Kidnap: బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం... పాల్పడింది తల్లే - latest news in nellore district

ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. సహజీవనం చేస్తున్న వ్యక్తితో కలిసి తల్లే ఈ కిడ్నాప్​కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

kidnap
బాలిక కిడ్నాప్
author img

By

Published : Aug 4, 2021, 10:53 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో సంచలనం రేపిన బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. కన్న తల్లే.. సహజీవనం చేస్తున్న వ్యక్తితో కలిసి ఈ కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. గత నెల 30న రాత్రి జొన్నవాడ గ్రామంలోని బాలిక నివాసానికి పోలీసులమంటూ ఓ మహిళ, మరో వ్యక్తి వచ్చారు. మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు ఫిర్యాదు వచ్చిందని ఇంట్లో సోదాలు నిర్వహించిన వీరు, 14ఏళ్ల బాలికను బలవంతంగా ఆటోలో తీసుకువెళ్లారు. కంగారు పడిన బాలిక నానమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు తల్లే కిడ్నాప్​కు పాల్పడినట్లు నిర్ధరించారు.

బాలిక కిడ్నాప్

దురుద్దేశంతోనే..

జొన్నవాడకు చెందిన మస్తాన్​తో నాగలక్ష్మి అలియాస్ కృష్ణవాణికి వివాహంకాగా, వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగా నాలుగేళ్ల క్రితం వీరు విడిపోయారు. పిల్లలు నానమ్మ వద్దే ఉంటున్నారు. భర్త నుంచి విడిపోయి నెల్లూరులో ఉంటున్న నాగలక్ష్మి అల్తాఫ్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వీరు జీవనోపాధి కోసం విజయవాడలో నివాసం ఉంటుండగా‌.. ఈనెల 30న రాత్రి జొన్నవాడకు వచ్చి బాలికను బలవంతంగా తీసుకువెళ్లారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టి రెండు రోజుల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు. సహజీవనం చేస్తున్న వ్యక్తి దురుద్దేశంతోనే బాలికను తీసుకువెళ్లినట్లు డీఎస్పీ తెలిపారు. కేసు చేధించిన పోలీసులను ఆయన అభినందించారు.

ఇదీ చదవండీ: Kidnap: అడిగిన డబ్బు ఇవ్వకపోతే మన బాబును చంపేస్తా.. చివరికి ఏం జరిగిందంటే !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.