ములుగు జిల్లా వాజేడు మండలం కొప్పుసూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన పేలుడు పదార్థాలను పోలీసులు నిర్వీర్యం చేశారు. అగ్ర నాయకులు బడే చొక్కా రావు అలియాస్ దామోదర్, కంకణాల రాజిరెడ్డి, ఇతర సీనియర్ నాయకులతో మిలిషియా సభ్యులు సమావేశమైనట్లు సమాచారంతో నిన్న ఉదయం కూంబింగ్‌కి బయల్దేరారు. ఏటూరునాగారం ఏఎస్పీ, వాజేడు, వెంకటాపురం ఎస్ఐలు, స్పెషల్ పార్టీ, బాంబు డిస్పోజల్ టీం, డాగ్ స్కాడ్, సీఆర్పీఎఫ్ బలగాలతో గలింపు చేపట్టారు.
గాలింపులో భాగంగా కొప్పుసూరు నుంచి గుండ్ల వాగు వెళ్లే దారిలో మావోయిస్టులు అమర్చిన పేలుడు పదార్థాలను కనుగొన్నారు. వెంటనే తగిన జాగ్రత్తలతో... బాంబు డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో నిర్వీర్యం చేశారు. సంబంధిత మావోయిస్టులపై వాజేడు పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు స్వాధీనపరుచుకున్న పేలుడు పదార్థాలతో ఉన్న టిఫిన్ బాక్సులు -02, అల్యూమినియం బాక్సులు -02, డిటోనేటర్ల-06, బ్లాక్ స్లార్రి (పేలుడు పదార్థం)- 900గ్రాముు, రెడ్ & బ్లాక్ వైర్, రస్టెడ్ స్మాల్ బోర్ట్స్ -10పోలీసులు స్వాధీనపర్చుకున్నారు.
ఇదీ చూడండి:Pawankalyan: పవర్‌స్టార్ వింటేజ్ పిక్స్.. ఫ్యాన్స్‌కు పండగే?