Edupayala Temple: మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయంలో దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. రెండ్రోజుల క్రితం ఏడుపాయల గుడిలోని హుండీల్లో నగదు చోరీకి గురైంది. అర్ధరాత్రి హుండీ పగలగొట్టిన దొంగ.. అందులోని నగదు, కానుకలను ఎత్తుకెళ్లాడు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. కేసు దర్యాప్తులో భాగంగా చిలప్‌చేడ్ మండలం శీలంపల్లిలోని ఓ ఇంట్లో పోలీసుల తనిఖీలు చేయగా.. ఏడుపాయల గుడిలో అపహరణకు గురైన సొమ్ము లభ్యమైంది. పాత వాషింగ్ మెషిన్‌లో దాచిన 2.36 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
కామారెడ్డి జిల్లా ఆత్మకూర్ వాసి లక్ష్మారెడ్డి హుండీలు చోరీ చేసినట్లు నిర్ధారించారు. లక్ష్మారెడ్డి చోరీ సొత్తును అత్తగారి ఇంట్లో దాచి పెట్టాడని.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!