Mahesh Bank Server Hacking Case: మహేశ్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులకు పూర్తి స్థాయిలో ఆధారాలు లభించడం లేదు. సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన ఖాతాలకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మూడు ఖాతాలను హ్యాక్ చేసిన సైబర్ మోసగాళ్లు.. ఆ ఖాతాల నుంచి ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లోని 20 బ్యాంకులకు చెందిన 128 ఖాతాలకు నగదు బదిలీ చేశారు.
Mahesh Bank Server Hacking Case Update: సైబర్ నేరగాళ్లు ఉపయోగించిన ఖాతాలు ఎవరివనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మూడు ఖాతాలను సైబర్ నేరగాళ్లే తెరిచారా.. లేక ఇతరుల సాయం తీసుకుని ఖాతాలను తెరిపించారా అనే వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు తెలుసుకుంటున్నారు. మూడు ఖాతాలకు సంబంధించి కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సదరు వ్యక్తులకు సైబర్ నేరగాళ్లకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకింగ్ రంగానికి ముప్పుగా పరిణమిస్తున్న హాకింగ్‌పై కేంద్ర సైబర్ సెక్యూరిటీ విభాగం కూడా ఆరా తీస్తోంది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!