సంగారెడ్డి కోర్టు నుంచి పరారైన విచారణ ఖైదీని పోలీసులు రెండు గంటల్లో పట్టుకున్నారు. ఓ హత్య కేసులో నిందితుడైన నరేశ్ అనే వ్యక్తిని విచారణ కోసం చర్లపల్లి జైలు నుంచి సంగారెడ్డి కోర్టుకు తీసుకొచ్చారు. కాలకృత్యాలకు వెళ్లొస్తానని చెప్పిన నిందితుడు.. పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాలింపు చేపట్టారు. కోర్టుకు సమీపంలోని ఓ ఇంటిపై నక్కిన నరేశ్‌ను గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు.