హైదరాబాద్లో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి బయటకు వచ్చేవారిని పోలీసులు ఆపరేషన్ ఛబుత్రాలో భాగంగా పట్టుకున్నారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీలో సోమవారం రాత్రి ఆపరేషన్ ఛబుత్రా చేపట్టారు.
లాక్డౌన్ సమయం ముగిసిన తర్వాత కూడా రోడ్లపై తిరుగుతున్న దాదాపు 40 మంది యువకులను అదుపులోకి తీసుకొన్నారు. వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. యువకులు మరోసారి ఈ విధంగా చేయకుండా వారి చేత ప్రతిజ్ఞ చేయించి వదిలేశారు.
ఇదీ చదవండి: Etela : హైదరాబాద్ చేరుకున్న ఈటల బృందం