ETV Bharat / crime

రూ.5కోట్లు అప్పు చేసి వ్యాపారి పరారీ.. వెంటాడి పట్టుకున్న పోలీసులు - హైదరాబాద్ నేర వార్తలు

Police Arrested Businessman: మంచి వ్యాపారం చేస్తున్నా.. సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు, పోలీసులతో సంబంధాలు ఉన్నాయంటూ.. జనాల వద్ద పెద్ద ఎత్తున అప్పు చేసి పరారైన ఘరానా మోసగాణ్ని జగిత్యాల పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. రేగోండ నరేశ్‌ అనే వ్యాపారిని అదుపులోకి తీసుకుని అతని నుంచి 3 కిలోల 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Jagityala Police Arrested Businessman
Jagityala Police Arrested Businessman
author img

By

Published : Jan 19, 2023, 3:24 PM IST

రూ.5కోట్లతో వ్యాపారి పరారీ.. చెజ్ చేసి పట్టుకున్న పోలీసులు

Police Arrested Businessman: రేగొండ నరేశ్‌ జగిత్యాల పట్టణంలో ఈ పేరు తెలియని వారు దాదాపు ఉండరేమో. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే చాలు క్షణంలో వాలి వారికి వేలల్లో సాయం చేస్తాడు. అడిగిన వారికి దావత్‌లు, విందులు, వినోదాలు ఏదైతేనేం ఎంత ఖర్చు అయినా సరే వెనుకాడే ప్రసక్తి లేదు. అతన్ని చూసిన వారు కోట్ల వ్యాపారం చేస్తున్నారని అనుకున్నారు.

ఇక పోలీసు, రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి పరిచయం చేసుకుని ఏదో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని వారిని ఆహ్వానించి వారి చేత సాయం అందజేస్తారు. ఇక సినిమా హీరోలు, హీరోయిన్‌లకు, సీరియల్‌ యాంకర్లకు పార్టీలు ఇవ్వటం వారితో ఫోటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో ఉంచటంతో ఇదంత చూసిన వారంత నిజంగానే నమ్మారు. ఇలా నమ్మి అతనికి, ఒకరికి తెలియకుండా ఒకరు అప్పులు ఇచ్చారు.

Police Arrested Businessman in Jagityala: పాపం మహిళల బంగారు అభరణాలను సైతం అధిక వడ్డీ ఆశ చూపటంతో, ఇంట్లో వాళ్లకు తెలియకుండా బంగారాన్ని ఇచ్చారు. ఇలా అప్పులు చేసిన దాదాపు 10 కోట్లకుపైగా నగదు, ఆభరణాలతో నరేశ్‌ ఉడాయించాడు. అతని ఆచూకి కనిపించకుండా పోవటంతో బాధితులంతా లబోదిబోమంటూ పోలీస్​స్టేషన్‌కు చేరారు. దాదాపు 130 మందికిపైగా పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అతని స్వరూపం వెలుగు చూసింది.

ఇన్ని రోజులు అతను హైదరాబాద్​లో అక్కడక్కడ పారిపోయి ఉన్నాడు. తరువాత మొన్న 16వ తేదీన వాళ్ల అమ్మ ఇంటికి వచ్చిందని సమాచారంతో, సీఐ కిషోర్ అతని సిబ్బంది కలిసి అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారణ నిమిత్తం సారంగపూర్ పోలీస్​స్టేషన్​కు తీసుకెళ్లి విచారుస్తూ ఉండగా, ఎస్​గార్డ్, ఈసీలు వాళ్ల కళ్లు గప్పి అతను అక్కడినుంచి పారిపోయడం జరిగింది. 18న అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని బ్యాగ్​ని చెక్ చేయగా, దానిలో దాదాపు 3 కిలోల 350 గ్రాముల బంగారం రీకవరి చేయడం జరిగింది. -ప్రకాశ్, డీఎస్పీ

అప్పటి నుంచి కనించకుండా తిరుతున్న నరేశ్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతన్ని హైదరాబాద్‌లో పట్టుకుని విచారణ నిమిత్తం సారంగపూర్‌ పోలీస్​స్టేషన్‌లో ఉంచారు. రాత్రికి రాత్రి పోలీసు కళ్లు కప్పి పారిపోయాడు. పారిపోతున్న నిందితుడిని జగిత్యాలలో కొద్ది గంటల్లోనే పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 3 కిలోల 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు 5కోట్ల అప్పులు చేసినట్లు చెబుతున్నా.. ఒక్కొక్కరు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అప్పు ఇచ్చిన వాళ్లు ఉన్నారు. అతనికి అప్పు ఇచ్చిన వాళ్లలో రాజకీయ నాయకులు, పోలీసులు కూడా ఉన్నట్లు సమాచారం. వారు ఎవరికి చెప్పుకోలేక మౌనంగా ఉంటున్నారు. కొందరు మాత్రమే బాధితులు బయటకు రాగా, నరేశ్‌ పోలీసులకు చిక్కటంతో అతనికి అప్పు ఇచ్చిన వారంతా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.