ETV Bharat / crime

14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక - Rape of minor girl

తల్లిదండ్రులు చనిపోవడంతో.. తాతయ్య వద్దే ఉంటున్న ఓ అమాయక బాలికను.. ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడో కామాంధుడు. శారీరక వాంఛ తీర్చుకోవడమే కాకుండా.. స్నేహితులతో కలిసి పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కడుపు నొప్పి రావడంతో వైద్యుడి వద్దకు వెళ్లి అడగ్గా.. గర్భవతి అని తేలింది. విజయవాడలో వెలుగుచూసిన ఈ దారుణ ఘటన సంచలనంగా మారింది.

police
14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక
author img

By

Published : Oct 14, 2022, 9:57 AM IST

ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలో ఓ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన.. చిన్నారుల రక్షణను ప్రశ్నార్ధకం చేస్తోంది. ప్రేమ పేరుతో లొంగదీసుకుని.. పలుమార్లు అత్యాచారం చేసి... బయటకు చెబితే వీడియోలు బహిర్గతం చేస్తామంటూ బెదిరింపులకు దిగారు ముగ్గురు కామాంధులు. తల్లిదండ్రులు లేని 14 ఏళ్ల బాలిక తన తాత వద్దే ఉంటోంది. 8వ తరగతి వరకు విజయవాడలోని తాతయ్య వద్దే ఉంటూ చదువుకుంది. ఈ ఏడాది మచిలీపట్నంలోని ఓ వసతిగృహంలో ఉంటూ 9వ తరగతి చదువుతోంది.

విజయవాడలో చదువుకునే రోజుల్లో, సాయి అనే యువకుడు ప్రేమించానని ఆమె వెంటపడ్డాడు. బైక్‌పై పాఠశాల వద్ద దింపేవాడు. ఈ క్రమంలో ఆమెను మభ్యపెట్టి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. తన స్నేహితులైన బబ్లూ, ప్రకాశ్‌తో కలిసి పలుసార్లు అత్యాచారం చేశాడని.. బాధితురాలు వైద్యుల వద్ద చెప్పినట్లు సమాచారం. ఈ ఏడాది మే నెలలో పలుమార్లు బాలికపై అత్యాచారం చేశారు. ఆమె గర్భవతి కావడంతో.. బంధువులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.

ప్రేమ పేరుతో బాలికను లోబరుచుకున్న సాయి.. పటమటలో నివసిస్తున్నాడు. అతడి స్నేహితులైన బబ్లూ, ప్రకాశ్‌తో కలిసి ఏ పనీ లేకుండా.. రోడ్లపై తిరుగుతుంటాడు. ఈ క్రమంలో.. పాఠశాలకు వెళుతున్న బాలిక వెంటపడ్డాడు. ప్రేమించానని మాయమాటలు చెప్పాడు. బైక్‌పై ఎక్కించుకుని తిరిగాడు. ఆ తర్వాత ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు సాయి.. ఇటీవల సాయి గుడిలో జరిగిన చోరీ కేసులో అరెస్టయి జైలులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అత్యాచారం కేసులో ప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయగా.. బబ్లూ కోసం గాలిస్తున్నారు.

గర్భవతి అయిన బాలికకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాలిక షాక్‌లో ఉన్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. వైద్యులు ఒక కమిటీగా ఏర్పడి.. డీఎన్‌ఏ నిర్ధరణ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలికను పరామర్శించేందుకు తెలుగుదేశానికి చెందిన ఓ మహిళా నేత.. వెళ్లగా ఆసుపత్రి సిబ్బంది లోపలికి రాకుండా అడ్డుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.