ETV Bharat / crime

ఖమ్మం జిల్లా బాలిక కిడ్నాప్​ కేసులో క్షుద్ర పూజారి అరెస్ట్ - ఖమ్మం జిల్లా వార్తలు

ఖమ్మం జిల్లా రేమిడిచర్ల గ్రామంలోని ఓ బాలికను కిడ్నాప్​ చేసిన కేసులో క్షుద్ర పూజారిని పోలీసులు అరెస్ట్​ చేశారు. గుప్త నిధుల వెలికితీతకు సహకరించాలని మాయమాటలు చెప్పి గతేడాది డిసెంబర్ 17న బాలికను కిడ్నాప్​ చేశాడు. పూజారి నుంచి బాలిక తప్పించుకుని మార్చి 30న స్వగ్రామానికి చేరగా.. బాలికను వెతుక్కుంటూ వచ్చి పోలీసులకు చిక్కాడు.

Khammam kidnap case, remidicharla news
ఖమ్మం బాలిక కిడ్నాప్​ కేసు, రేమిడిచర్ల వార్తలు
author img

By

Published : Apr 6, 2021, 10:48 PM IST

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల గ్రామంలో గతేడాది డిసెంబర్ 17న గుప్తనిధుల వ్యవహారంలో సంచలనం సృష్టించిన బాలిక మిస్సింగ్ కేసు ఎట్టకేలకు సుఖాంతమైంది. గుప్త నిధుల వెలికితీతకు సహకరించాలని మాయమాటలు చెప్పి బాలికను కిడ్నాప్​ చేసిన పూజారిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

క్షుద్రపూజ సమయంలో బాలికను ఒంటరిగా తనతోపాటు కూర్చోబెట్టాలని బాలిక బంధువులపై సదరు పూజారి జిల్లాపల్లి సూర్య ప్రకాశ్ శర్మ ఒత్తిడి చేశారు. అదే అదనుగా భావించిన పూజారి.. బాలికకు మాయమాటలు చెప్పి, తనతో పాటు మధ్యప్రదేశ్​లోని ఉజ్జయినికి తీసుకెళ్లాడు.

దాదాపు వంద రోజుల పాటు బాలిక ఆచూకీ దొరక్కుండా తన ఆధీనంలోనే ఉంచాడు. సదరు పూజారి నుంచి బాలిక తప్పించుకుని మార్చి 30న స్వగ్రామానికి చేరింది. అనంతరం బాలిక తన తల్లితో కలిసి ఎర్రుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో బాలికను వెతుక్కుంటూ క్షుద్ర పూజారి ఎర్రుపాలెం చేరుకున్నాడు. ఇది తెలుసుకున్న పోలీసులు పూజారిని అదుపులోకి తీసుకున్నారు. క్షుద్ర పూజలు చేయించిన 8మందిపైన కేసు నమోదు చేసినట్లు వైరా ఏసీపీ సత్యనారాయణ, సీఐ మురళి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.