ETV Bharat / crime

ఇంట్లో బంగారం మాయం.. ఏమైందని చూస్తే బయటపడ్డ కుమార్తె వ్యవహారం.. ఏమైందంటే..? - gold thief arrest

ఇంట్లో ఉన్న నగలు మొత్తం మాయమయ్యాయి. సుమారు 24.5 తులాల బంగారం కనిపించట్లేదు. ఇంట్లో ఎవ్వరినడిగినా.. తెలియదనే సమాధానమే వస్తోంది. దొంగలు పడ్డారా..? అలాంటి ఆనవాళ్లేమీ కనిపించట్లేదు. కానీ.. చోరీ జరిగినట్టు మాత్రం అర్థమవుతోంది. ఇంట్లోకి ఎవరెవరు వచ్చారు..? ఎవరు దోచుకుని ఉంటారు..? అన్న దానిపై లోతుగా డిటెక్టివ్​ ఆపరేషన్​ మొదలుపెట్టారు. ఈ క్రమంలో.. తమ కుమార్తె వ్యవహారం బయటపడింది. ఏమిటా వ్యవహారం..? దానికి దొంగతనానికి సంబంధం ఏంటీ..? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

police arrested Instagram thief who theft gold in kukatpally

author img

By

Published : May 5, 2022, 1:15 AM IST

సరిగ్గా మూడు రోజుల క్రితం.. అంటే మే 1న అన్నమాట. ఆ రోజు ఆదివారం.. హైదరాబాద్​ మూసాపేట్​లో నివాసముంటున్న ఆవుల విజయ్​కుమార్​ భార్యకు.. నగలు అవసరం పడటంతో ఇంట్లో ఉన్న బీరువా తెరిచింది. ఎంతో భద్రంగా దాచుకున్న నగలు ఆమెకు కనిపించలేదు. కంగారు పడింది. బీరువా మొత్తం జల్లెడ పట్టింది. అయినా బంగారం కనిపించలేదు. ఆందోళన, భయం.. అన్ని కలిపి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎందుకంటే.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 24.5 తులాల బంగారం మరి. వారం క్రితం చూసినప్పుడు నిక్షేపంగా ఉన్న బంగారం ఇప్పుడు మాయం కావటంతో ఇంట్లో వాళ్లంతా టెన్షన్​ పడుతున్నారు. దాచిపెట్టే వీలున్న అన్నిదగ్గర్లా ఒకటికి రెండు సార్లు వెతుకుతున్నారు. అయినా ఎలాంటి ఫలితం లేదు. దొంగతనం జరిగిందా..? అని అనుమానం వ్యక్తం చేశారు. అలాంటి ఆనవాళ్లేమీ వాళ్లకు కనిపించలేదు. ఇంటికి వచ్చిన వాళ్లేవరైనా తీసుంటారా..? అని ఆలోచించారు. తెలిసినవాళ్లు ఎలా తీస్తారని సమాధానం చెప్పుకున్నారు. అయినా.. అంత బంగారం చూశాక తెలిసినవాళ్లేంటీ..? తెలియనివాళ్లేంటీ..? ఆశకు అవేవీ అడ్డురావని అంచనాకు వచ్చారు.

ఇందులో భాగంగా.. వారం రోజులుగా ఇంటికి ఎవరెవరు వచ్చారు..? అన్న అంశంపై ఆరాలు తీయటం మొదలుపెట్టారు. అయితే విజయ్​కుమార్​ దంపతులు బయటికి వెళ్లినప్పుడు తమ కుమార్తె మేఘన.. ఒంటరిగా ఇంట్లో ఉండేది. ఆ సమయంలో ఇంటికి ఎవరైనా వచ్చారా..? అని ఆమెను అడిగారు. మొదట ఎవరు రాలేదని చెప్పిన మేఘనను తల్లిదండ్రులు గట్టిగా ఆడిగారు. బయపడిపోయిన మేఘన.. ఒకటి రెండు సార్లు తన స్నేహితుడు వచ్చాడని చెప్పింది. ఇంకేముంది.. దొంగతనం గురించి ఆరా తీస్తే.. తమ కుమార్తె వ్యవహారం కూడా బయటపడింది. ఈ వ్యవహారానికి దొంగతనానికి సంబంధం ఉందని అనుమానించిన తల్లిదండ్రులు.. వెంటనే కూకట్​పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికి వచ్చిన కుర్రాడి గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

అయితే.. మేఘనకు జనవరిలో ఇన్​స్టాగ్రాంలో సురేష్​ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన బానోత్​ సురేష్​.. కూకట్​పల్లి ఆల్విన్​కాలనీలో నివాసముంటున్నాడు. స్విగ్గి డెలివరీ బాయ్​గా పనిచేస్తున్నాడు. మేఘనతో మెల్లగా చాటింగ్​ మొదలుపెట్టాడు సురేష్​. ప్రొఫైల్​లో అందమైన యువకుని ఫొటో పెట్టటంతో ఆకర్షితురాలైన మేఘన.. అతడితో చాటింగ్​ చేయటం మొదలుపెట్టింది. అది కాస్తా పెరిగి కాల్స్​ మాట్లాడుకోవటం వరకు వచ్చింది. ఆ దశను కూడా దాటి ఒకరినొకరు కలుసుకోవాలనుకున్నారు. ఏప్రిల్​ 20న ఇంట్లో ఎవరు లేని సమయంలో సురేష్​ను ఇంటికి ఆహ్వానించింది మేఘన. ఇంటికి వెళ్లిన సురేష్​.. వాళ్ల ఇంటిని పరిశీలించాడు. కూల్​డ్రింక్​ కావాలని అడగటంతో.. తీసుకొచ్చేందుకు మేఘన బయటకు వెళ్లింది. ఈ సమయంలో.. ఇంట్లో ఉన్న బీరువాను చూశాడు. తెరిచి చూస్తే.. దగదగలాడుతూ బంగారం మెరిసిపోతోంది. ఇంకేముంది.. కళ్లు జిగేల్​మనటంతో దోచుకోవాలన్న కోరిక కలిగింది. అంతా తీసుకుంటే అనుమానం వస్తుందనుకున్నాడో..? లేక మొత్తం తీసుకునేందుకు ధైర్యం సరిపోలేదో..? సుమారు 6 తులాల వరకు తీసుకుని.. అనుమానం రాకుండా కూర్చున్నాడు. మేఘన తెచ్చిన కూల్​డ్రింక్​ తాగేసి.. సరదాగా కబుర్లు చెప్పుకుని వెళ్లిపోయాడు.

అన్నినగలను కళ్లారా చూసిన సురేష్..​ ఆ బంగారాన్ని మర్చిపోలేకపోయాడు. అమ్మాయి కంటే ఎక్కువ ఆ పుత్తడే అతడిని ఎక్కువ ఆకర్షించింది. ఇంకేముంది మళ్లీ వాళ్లింటికి వెళ్లేందుకు తహతహలాడాడు. మేఘనను తరచి తరచి అడగటంతో 24న మళ్లీ ఇంటికి పిలిచింది. ఇక ఇప్పుడు కూడా ఏదో రకంగా మేఘనను బయటకు పంపించిన సురేష్​.. ఈసారి మొత్తం బంగారాన్ని అంటే.. 18.5 తులాలను నొక్కేశాడు. కాసేపు కబుర్లు చెప్పి వచ్చేశాడు.

కట్​ చేస్తే.. మే 1న నగలు కనిపించకపోవటంతో.. సురేష్​ విషయం బయటపడగా తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. సురేష్​ను పోలీసులు ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. తాను చేసిన నేరాన్ని సురేష్​ అంగీకరించాడు. నిందితుని దగ్గర నుంచి 24.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు కూకట్​పల్లి ఏసీపీ చంద్రశేఖర్​ వివరించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.