ఖమ్మం జిల్లా కారేపల్లిలో దారుణ హత్యకు గురైన మహిళ... మండల పరిధిలోని బధ్య తండాకు చెందిన అజ్మీర నాజీ (65)గా పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. మహిళను పాశవికంగా హత్య చేసి మొండెం భాగాన్ని గార్ల మండల పరిధిలో రైలు పట్టాల వద్ద పడేసినట్లు చెప్పారు. తలభాగంపై స్పష్టత కోసం దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
వస్త్రాలను బట్టి గుర్తింపు...
మొదట్లో మహిళను నిర్ధరించని గ్రామస్థులు ఘటనా స్థలంలో పడి ఉన్న వస్త్రాలను బట్టి నాజీ (65)గా చెబుతున్నారు. సదరు మహిళ తప్పిపోయిందని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు తెలిపిన ఆనవాళ్లను బట్టి... అజ్మీర నాజీగా ప్రాథమికంగా గుర్తించినట్టు పేర్కొన్నారు.
అన్నం ఫౌండేషన్...
అన్నం ఫౌండేషన్ సభ్యులు మరోసారి సేవాగుణాన్ని చాటుకున్నారు. రైలు పట్టాల వద్ద హత్యకు గురైన మహిళ మొండెం భాగం భయానకంగా ఉండడంతో... పోలీసు అధికారులు జిల్లా కేంద్రానికి చెందిన అన్నం శ్రీనివాసరావును సంప్రదించారు. వెంటనే స్పందించిన ఆయన తన బృందంతో వచ్చి మృతదేహం తరలింపునకు సహకరించారు.
ఇదీ చదవండి: దారుణం: మహిళను హతమార్చి.. శరీర భాగాలు వేరు చేసి!