నకిలీ పత్రాలు సృష్టించి భూములు విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను.. సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 40 ఎకరాల భూమి ఇలాగే విక్రయించి బాధితుల నుంచి ఎనిమిదిన్నర కోట్లు(cheating) కొల్లగొట్టారని సీపీ సజ్జనార్ తెలిపారు. వేరే వారి భూమికి నకిలీ పత్రాలు సృష్టించిన ప్రధాన నిందితుడు ఆదినారాయణ మూర్తి... ఎకరం కోటి 40లక్షల రూపాయల చొప్పున 40 ఎకరాలకు 56 కోట్లు రూపాయలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నాడు.
ఇందులో ఎనిమిదిన్నర కోట్లు అడ్వాన్స్ తీసుకొని మోసం చేశారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి బాధితుడు ఆరా తీయగా... ఆదినారాయణ మూర్తి ఇచ్చినవి నకిలీ పత్రాలని తేలాయి. నిందితుల నుంచి 264 నకిలీ డాక్యుమెంట్లు, మహబూబ్‌నగర్ తహసీల్దార్, ఆర్డీవో పేరుతో ఉన్న 9 రెవెన్యూ స్టాంప్స్, సీల్స్, 51 పట్టాదారు పాస్‌బుక్స్ స్వాధీనం చేసుకున్నామని సీపీ వెల్లడించారు.
ఇదీ చదవండి: మద్యం మత్తులో పాదం నరుక్కున్న వ్యక్తి